Salesforce: దేవుడా.. Salesforce సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంత పని చేసింది..!
ABN, First Publish Date - 2022-11-09T19:01:39+05:30
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ Salesforce కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు సిద్ధపడింది. ఈ వారంలో కొందరు ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వాలని..
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ Salesforce కీలక నిర్ణయం తీసుకుంది. భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు (Salesforce Layoffs) సిద్ధపడింది. ఈ వారంలో కొందరు ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వాలని డిసైడ్ అయింది. ఈ విషయాన్ని సేల్స్‌ఫోర్స్ సంస్థ మంగళవారం నాడు నిర్ధారించింది. సేల్స్‌ఫోర్స్ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 2,500 మంది ఉద్యోగులకు సంకటంగా మారింది. సోమవారం నాడు 1,000 మంది ఉద్యోగులను విధుల్లో నుంచి తొలగిస్తూ ఆ సంస్థ మెయిల్స్ ద్వారా సదరు ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కోవిడ్-19 కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రభావం టెక్ కంపెనీల మీద తీవ్రంగా పడింది. దీంతో.. ప్రముఖ టెక్ కంపెనీలు ఇప్పటికే కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.
మూన్‌లైటింగ్ పేరుతో మరికొందరు ఉద్యోగులను తొలగించి వ్యయ భారం తగ్గించుకున్నాయి. కొన్ని దేశాలు, పరిశ్రమల నుంచి సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గిపోయింది. సాఫ్ట్‌వేర్ కంపెనీలకు క్లయింట్స్ నుంచి ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు రాకపోవడంతో ఉద్యోగులకు భారీ వేతనాలు చెల్లించడం సేల్స్‌ఫోర్స్ వంటి కంపెనీలకు కూడా భారంగా మారింది. దీంతో.. వ్యయ భారాన్ని తగ్గించుకునే క్రమంలో ఆశించిన స్థాయిలో రాణించని కొందరు ఉద్యోగులను ఇంటికి పంపించేయాలని సేల్స్‌ఫోర్స్ (Salesforce) కంపెనీ నిర్ణయించింది.
అంతేకాదు.. 2,500 మంది ఉద్యోగులనే కాకుండా మరో 700 మంది ఉద్యోగులకు 30 రోజులు గడువు ఇచ్చి లక్ష్యాలను నిర్దేశించి ఆ లక్ష్యాలను చేరుకోని క్రమంలో ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. గత జనవరి నాటికి సేల్స్‌ఫోర్స్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 73,541. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో గతేడాది 36 శాతం ఉద్యోగ నియామకాలు జరిగినట్లు ఆగస్ట్‌లో సేల్స్‌ఫోర్స్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన నెలల వ్యవధిలోనే తాజాగా సేల్స్‌ఫోర్స్ ఉద్యోగాల కోతను సిద్ధం కావడం గమనార్హం.
Updated Date - 2022-11-09T19:01:45+05:30 IST