Smartphone Sales: దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్ సేల్స్

ABN, First Publish Date - 2022-10-27T20:58:30+05:30

పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు(Smartphone Sales) దుమ్మురేపాయి. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పండుగ

Smartphone Sales:  దుమ్మురేపిన స్మార్ట్‌ఫోన్ సేల్స్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు(Smartphone Sales) దుమ్మురేపాయి. ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో పండుగ సందర్భంగా నిర్వహించిన సేల్స్‌లో ఆఫర్ల మోతక్కించాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల(smartphones)పై ఊరించే ఆఫర్లు ప్రకటించాయి. దీంతో దేశంలో వాటి అమ్మకాలు ఓ రేంజ్‌లో జరిగాయి. ఈ పండుగ సీజన్‌(Festive Season)లో రికార్డు స్థాయిలో మొత్తంగా 7.7 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు(Smartphone Sales in India) జరిగినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. దివాలీ సేల్‌తో ఈ ఫెస్టివ్ సీజన్‌కు తెరపడింది.

దేశంలో జరిగే వార్షిక స్మార్ట్‌ఫోన్ అమ్మకాలలో 20 శాతానికిపైగా ఈ నాలుగైదు వారాల వ్యవధిలోనే జరుగుతాయని ‘కౌంటర్‌పాయింట్’ సీనియర్ విశ్లేషకుడు ప్రచీర్ సింగ్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 9 శాతం క్షీణిస్తున్నట్టు అంచనాలు ఉన్నట్టు చెప్పారు. చైనాలో ఈ ట్రెండ్ ఉందని, అక్కడ గతేడాదితో పోలిస్తే విక్రయాలు 10 శాతం తగ్గినట్టు వివరించారు. ఇండియాలో స్మార్ట్‌ఫోన్ల సగటు అమ్మకపు ధర (ASP) అత్యధిక స్థాయికి చేరుకుంటుందని అన్నారు. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ మాట్లాడుతూ.. ఏఎస్పీ అత్యధికంగా ఉంటుందని, అది 12 శాతం నుంచి 15 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. మధ్యస్థ, ప్రీమియం సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్లకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుందని అన్నారు.

పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు రూ. 15 వేల సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫీచర్లతో ఫోన్లు విడుదల చేశాయి. దీంతో అవి చాలామందికి అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు, 5జీ ఫోన్లు కూడా దాదాపు అదే ధరలో అందుబాటులో ఉండడంతో 4జీ నుంచి 5జీకి మారడం సులభమైంది. పండుగ సీజన్‌లో అమ్ముడుపోయిన ప్రతీ మూడు స్మార్ట్‌ఫోన్లలో ఒకటి 5జీ స్మార్ట్‌ఫోనేనని తరుణ్ పాఠక్ తెలిపారు.

Updated Date - 2022-10-28T06:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising