Tata Motors: ఎలక్ట్రిక్ వెహికల్ డీలర్ ఫైనాన్సింగ్ ప్రోగ్రాం.. హెడ్‌డీఎఫ్‌సీతో టాటా మోటార్స్ భాగస్వామ్యం
ABN, First Publish Date - 2022-11-29T19:01:44+05:30
ఎలక్ట్రిక్ డీలర్ ఫైనాన్సింగ్ ప్రోగ్రాం ఫైనాన్సింగ్ ప్రోగ్రాంలో భాగంగా దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)తో టాటా మోటార్స్ చేతులు కలిపింది
ముంబై: ఎలక్ట్రిక్ డీలర్ ఫైనాన్సింగ్ ప్రోగ్రాం ఫైనాన్సింగ్ ప్రోగ్రాంలో భాగంగా దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ (HDFC)తో టాటా మోటార్స్ చేతులు కలిపింది. ఇందులో భాగంగా టాటా మోటార్స్ (Tata Motors) దాని డీలర్లకు వారి ఐసీఈ పైనాన్స్ పరిమితికి మించి అదనపు ఇన్వెంటరీ నిధులను రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (RLLR)తో అనుసంధానించిన ఆకర్షణీయమైన ధరలతో అందిస్తుంది. తిరిగి చెల్లింపు వ్యవధి 60 నుంచి 75 రోజుల వరకు ఉంటుంది. అధిక డిమాండ్ దశలను అందించడానికి బ్యాంక్ అదనపు పరిమితిని కూడా అందిస్తుంది, ఇది ఏడాదిలో మూడుసార్లు డీలర్లకు అందుబాటులో ఉంటుంది.
ఈ ఫైనాన్స్ స్కీమ్‌పై టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ డైరెక్టర్ అసిఫ్ మల్బరి మాట్లాడుతూ.. తమ అధీకృత ఈవీ డీలర్ పార్ట్‌నర్ల కోసం ఈ ఫైనాన్సింగ్ ప్రోగ్రాం కోసం హెచ్‌డీఎఫ్‌సీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా తమ వినియోగదారులకు ఈవీ కొనుగోలు అనుభవాన్ని మరింత సులభతరం చేస్తామని అన్నారు.
హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్ హెడ్ (రిటైల్ అసెట్స్) అరవింద్ కపిల్ మాట్లాడుతూ.. కస్టమైజ్డ్ ఫైనాన్సింగ్ ప్రోగ్రాం ద్వారా కొత్త వినియోగదారుల విభాగాలను ట్యాప్ చేయడంతోపాటు దేశంలో ఈవీ సంస్కృతిని ప్రోత్సహించడంలో ఇది తమకు సహాయపడుతుంది. 2031-32 నాటికి కార్బన్ న్యూట్రల్‌గా మారే దిశగా తమ ప్రయాణంలో ఇది మరో అడుగని అన్నారు.
Updated Date - 2022-11-29T19:01:46+05:30 IST