ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

E commerce sites: రివ్యూలు, రేటింగ్ ఇచ్చే వినియోగదారులకు శుక్రవారం నుంచి కొత్త రూల్స్... ఇకపై..

ABN, First Publish Date - 2022-11-23T19:34:04+05:30

‘ఈ వస్తువు పనితీరు చాలా బావుంది. రేటుకు తగ్గ బెస్ట్ ప్రొడక్ట్ ఇది. కళ్లు మూసుకుని కొనేయవచ్చు’’.. ఈ -కామర్స్ (E-Commerce) వెబ్‌సైట్స్‌పై (Websites) కనిపించే రివ్యూలు ఇవే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ‘ఈ వస్తువు పనితీరు చాలా బావుంది. రేటుకు తగ్గ బెస్ట్ ప్రొడక్ట్ ఇది. కళ్లు మూసుకుని కొనేయవచ్చు’’.. ఈ -కామర్స్ (E-Commerce) వెబ్‌సైట్స్‌పై (Websites) కనిపించే రివ్యూలు ఇవే. అంతేనా రేటింగ్స్ ఓ రేంజ్‌లో దర్శనమిస్తుంటాయి. కొన్ని రేటింగ్స్ 5/5 లేదా 10/10 స్టార్‌లతో కనిపిస్తుంటాయి. అయితే వీటిల్లో ఎక్కువ నకిలీ రివ్యూలు, రేటింగ్స్ అనేది నిజం. ఇలాంటి ఫేక్ రివ్యూలు, రేటింగ్‌లకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగువేసింది. ఈ మేరకు గత సోమవారం (21-11-2022) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. నవంబర్ 25, 2022 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనలతో ఫేక్ రివ్యూలు, రేటింగ్‌లకు చెక్ పెట్టవచ్చు. ఈ-కామర్స్ సంస్థలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ప్రభుత్వం గతేడాది ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

కాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) కింద ‘IS 19000:2022’ పేరిట ఈ రూల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నిబంధన కింద ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ నిర్వహకులు సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. తమ టూల్స్‌ లేదా వ్యక్తిగతంగా కల్పించుకుని ఉద్దేశపూర్వక లేదా నకిలీ రివ్యూలను జల్లెడ పట్టాల్సి ఉంటుంది. రివ్యూ, రేటింగ్‌ల తేదీలను పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వినియోగదారులు ఒకసారి రివ్యూ ఇస్తే.. మళ్లీ దానిని ఎడిట్ చేసే అవకాశమివ్వకూడదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు ఫేక్ రివ్యూలు ఇచ్చేవారు భవిష్యత్‌లో ఎలాంటి రివ్యూలు ఇవ్వకుండా వారి అకౌంట్లను నిషేధించాలని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత భాగస్వాములందరూ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని వినియోగదారుల వ్యవహారాల సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ-రిటైలర్ భాగస్వాములందరూ వీలైనంత త్వరగా ఈ విధానంలోకి మారాలని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-23T19:34:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising