Twitter layoffs: ఇది అవమానకరం.. భారత్‌లో ట్విటర్ మాజీ ఉద్యోగుల వ్యాఖ్య

ABN , First Publish Date - 2022-11-07T19:59:44+05:30 IST

తమను అవమానకర రీతిలో తొలగించారంటూ(Layoff) భారత్‌లోని ట్విటర్ మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Twitter layoffs: ఇది అవమానకరం.. భారత్‌లో ట్విటర్ మాజీ ఉద్యోగుల వ్యాఖ్య

ఇంటర్నెట్ డెస్క్: తమను అవమానకర రీతిలో తొలగించారంటూ(Layoff) భారత్‌లోని ట్విటర్ మాజీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనిశ్చితిలో పడిపోయామని చెబుతున్నారు. నెట్టింట్లో తమకు మద్దతుగా వినిపిస్తున్న వ్యాఖ్యలు, తొలగింపులు తప్పవన్న ముందుస్తు ఎరుక కూడా తమ వేదనను ఏమాత్రం తగ్గించలేక పోయాయన్నారు. ఇండియాలో పనిచేస్తున్న ట్విటర్‌ ఉద్యోగుల్లో దాదాపు 90 శాతం మంది ఉద్వాసనకు గురయ్యారని సమాచారం. అయితే.. శుక్రవారం ట్విటర్ యాజమాన్యం నుంచి ఉద్యోగులకు అందింది. తొలగింపులతో ప్రభావితమైన వారందరికీ పరిహారం అందుతుందనేది ఆ లేఖ సారాంశం.

కాగా.. ట్విటర్‌ను(Twitter) ఎలాన్ మస్క్(Elon musk) చేజిక్కించుకున్నాక ఓ సింక్‌తో ఆయన సంస్థ కార్యాలయంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ట్విటర్‌ ఇక తనదే అనే విషయం మెదళ్లల్లో ఇంకనివ్వండి అనే అర్థం వచ్చేలా మస్క్ ‘సింక్’ అను ఉపయోగించారు. ఇక ట్విటర్ చేజిక్కించుకున్నాక మస్క్ సంస్థలో పలు మార్పులకు తెరలేపారు. మునుపటి యాజమాన్యాన్ని మొత్తం తొలగించారు. తనకు నమ్మకస్థులైన వ్యక్తులకు బాధ్యతలు అప్పగించారు. వీరిలో భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. ఇక బ్లూ టిక్ కావాలనుకునే వారు 8 డాలర్లు పెట్టి సబ్‌స్క్రీప్షన్ కొనాలని నిబంధన విధించారు. ఫేక్ అకౌంట్లపై కూడా ఉక్కుపాదం మోపుతానంటూ గర్జించిన మస్క్ ఆ దిశగా కార్యాచరణ కూడా మొదలెట్టారు.

Updated Date - 2022-11-07T20:01:37+05:30 IST

Read more