Vodafone Idea: వొడాఫోన్ ఐడియాలోని ఈ ప్లాన్‌తో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్
ABN, First Publish Date - 2022-11-08T17:09:50+05:30
వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) వినియోగదారులకు ఇది శుభవార్తే. అదనపు ప్రయోజనాలు కావాలని కోరుకునే వారికి ‘వి మ్యాక్స్’
న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) వినియోగదారులకు ఇది శుభవార్తే. అదనపు ప్రయోజనాలు కావాలని కోరుకునే వారికి ‘వి మ్యాక్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ పోస్టుపోయిడ్ ప్లాన్లు ఇప్పుడు దేశమంతా అందుబాటులో ఉన్నాయి. పోస్టు పెయిడ్ ప్లాన్లు కావడంతో ప్రతి ఒక్కరికీ ఇవి అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే, పోస్టుపెయిడ్ ప్లాన్‌కు మారాలనుకునే వారికి మాత్రం ఇవి చక్కని ప్లాన్లుగా చెప్పుకోవచ్చు. ఈ ప్లాన్లలో అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) మెంబర్‌షిప్ అదనంగా లభిస్తుంది.
మీరు కనుక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటే కనుక దానికంటే వొడాఫోన్ ఐడియా (Vi) పోస్టుపెయిడ్ ప్లాన్ తీసుకోవడం మంచింది. ‘వి’ తీసుకొచ్చిన రూ. 501 ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ ఆరు నెలలపాటు లభిస్తుంది. అయితే, ఇది ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఒక్కటే కాదు.. డిస్నీప్లస్ హాట్ స్టార్ మొబైల్, వీఐ మూవీస్ అండ్ టీవీ, వి యాప్‌లో హంగామా మ్యూజిక్, వి గేమ్స్ గోల్డ్ వంటివి ఈ ప్లాన్‌తో లభిస్తాయి. అలాగే, నెలకు 90 జీబీ డేటా, 200 జీబీ డేటా రోలోవర్, అపరిమిత వాయిస్ కాల్స్, నెలకు 3 వేల ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం కావాలనుకునే వారికి ఇది సరసమైన ప్లాన్.
ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఖర్చుపెట్టగలిగితే కనుక రూ. 701, రూ. 1101 ప్లాన్లు కూడా ఉన్నాయి. వీటిలో అమెజాన్ ప్రైమ్‌తోపాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ ఇటీవలే ప్రవేశపెట్టింది. వి మ్యాక్స్ రూ. 701 ప్లాన్‌లో ట్రూలీ అన్‌లిమిటెడ్ డేటా, నెలకు 3000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. డేటా ట్రూలీ అన్‌లిమిటెడ్ కాబట్టి డేటా రోల్ ఓవర్ సౌకర్యం ఉండదు. అలాగే, రూ. 501 ప్లాన్‌లో లభించే మిగతా అన్ని ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ఆరు నెలల అమెజాన్ ప్రైమ్, 12 నెలల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (12 నెలల సూపర్ సబ్‌స్క్రిప్షన్), వి మూవీస్ అండ్ టీవీ, గేమ్స్ (1000 ఉచితం ప్లస్ 5 గోల్డ్), వి యాప్‌లో హంగామా మ్యూజిక్ వంటివి లభిస్తాయి.
వి రెడెక్స్ రూ.1,101 ప్లాన్ వి మ్యాక్స్ ప్లాన్లలో చివరిది. రెడెక్స్ ప్లాన్ అయిన ఇది ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ట్రూలీ అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ట్రూలీ అన్‌లిమిటెడ్ డేటా, నెలకు 3000 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. ఇందులో కూడా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఆరు నెలల కాలపరిమితితో లభిస్తుంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 12 నెలలపాటు ఉంటుంది. వి మూవీస్ అండ్ టీవీ, గేమ్స్ (1000 ఉచితం ప్లస్ 5 గోల్డ్), వి యాప్‌లో హంగామా మ్యూజిక్ వంటి ప్రయోజనాలున్నాయి. అలాగే, మేక్‌మై ట్రిప్ ప్రయోజనాలు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ (ఏడాదికి నాలుగుసార్లు), రూ.2,999 విలువైన అంతర్జాతీయ రోమింగ్ ఏడాది ఒకసారి లభిస్తాయి.
Updated Date - 2022-11-08T17:09:52+05:30 IST