ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vodafone Idea: ఈ ఆఫర్‌ మరికొన్ని గంటలే.. తొలగించేస్తున్న వొడాఫోన్ ఐడియా

ABN, First Publish Date - 2022-11-29T17:16:11+05:30

దేశంలోని మూడో అతిపెద్ద టెలికం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా (వి) ఇటీవల ప్రకటించిన అదనపు డేటా ఆఫర్ ఈ నెల 30తో ముగియనుంది.

vodafone idea
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలోని మూడో అతిపెద్ద టెలికం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా (వి) ఇటీవల ప్రకటించిన అదనపు డేటా ఆఫర్ ఈ నెల 30తో ముగియనుంది. ఈ ఏడాది నవంబరు 15 నుంచి 30వ తేదీ మధ్య రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు ఈ అదనపు డేటా ఆఫర్‌ను ‘వి’ ప్రకటించింది. రూ. 1,449, రూ. 2,899, రూ. 3,099 ప్లాన్లపై అదనపు డేటా ఆఫర్‌ను ప్రకటించింది.

* రూ. 1,449 ప్లాన్‌ 180 రోజుల కాలపరిమితితో లభిస్తుండగా రూ. 2,899, రూ. 3,099 ప్లాన్లు ఏడాది కాలపరిమితితో లభిస్తున్నాయి.

* రూ. 1,449 ప్లాన్‌లో యూజర్లకు 50 జీబీ అదనపు డేటా లభిస్తుంది. రూ. 2,899, రూ. 3,099 ప్లాన్లలో 75 జీబీ డేటా బోనస్ డేటా లభిస్తుంది.

* రూ. 1,499 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే, హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతోపాటు వి మూవీస్, టీవీ వీఐపీ బండిల్డ్‌గా లభిస్తాయి.

* రూ. 2,899 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీంతోపాటు రూ. 1,449 ప్లాన్‌లోని అన్ని ప్రయోజనాలు లభిస్తాయి.

* రూ. 3,099 ప్లాన్‌లో పై రెండు ప్లాన్లలోని ప్రయోజనాలు లభిస్తాయి. అయితే, రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అలాగే, ఏడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది.

* పై అన్ని ప్లాన్లలోనూ నిర్దేశించిన డేటా వాడుకున్న తర్వాత డేట వేగం 64 కేబీపీఎస్‌కు పడిపోతుంది.

Updated Date - 2022-11-29T17:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising