Osmania Universityలో పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా
ABN , First Publish Date - 2022-11-07T15:36:19+05:30 IST
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ - పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియలాజికల్ ఫిజిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ - పోస్ట్ ఎమ్మెస్సీ డిప్లొమా ఇన్ రేడియలాజికల్ ఫిజిక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఓయూ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్, హైదరాబాద్‌లోని వివిధ ఆసుపత్రుల సహకారంతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో ఎమ్మెస్సీ(ఫిజిక్స్/ న్యూక్లియర్ ఫిజిక్స్)/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 22
ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ: డిసెంబరు 18
వెబ్‌సైట్: ouadmissions.com
Read more