ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Anurag Thakur: హిమాచల్‌లో బీజేపీకి 44కు పైగా సీట్లు, గుజరాత్‌లో సరికొత్త రికార్డు

ABN, First Publish Date - 2022-11-09T16:01:35+05:30

ఉనా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరుగుతాయని, గుజరాత్‌లో గత రికార్డులను బీజేపీ అధిగమిస్తుందని కేంద్ర...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఉనా: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరుగుతాయని, గుజరాత్‌లో గత రికార్డులను బీజేపీ అధిగమిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తన స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఆయన సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రతిరోజూ దాదాపు 15 నుంచి 16 ర్యాలీల్లో ప్రచారం సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్, గుజరాత్‌లో పార్టీ విజయం తథ్యమని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లో జైరామ్ ఠాకూర్ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు ప్రదర్శించిందని, జైరామ్ ఠాకూర్ సారథ్యంలోనే బీజేపీ ఎన్నికలకు వెళ్తోందని, మరో మాటకు తావులేదని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చాలా కాలం క్రితమే హిమాచల్ ప్రదేశ్‌లో దుకాణం మూసేసిందని, పోటీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యేనని అన్నారు. అయితే, కాంగ్రెస్ ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు.

ఈసారి హిమాచల్ మహిళలకు తాము ప్రత్యేక మేనిఫెస్టో తెచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, గర్భిణీ స్త్రీలకు రూ.25,000, 6 నుంచి 12 తరగతి వరకూ ఆడపిల్లలకు సైకిల్, కాలేజీకి వెళ్లే విద్యార్థినులకు స్కూటీ ఇస్తామని చెప్పారు. పేద మహిళలకు ఎల్‌పీజీ సిలెండర్లు, మహిళా రుణాలు, ఆయుష్మాన్ భారత్ అండ్ హిమకేర్ కింద మహిళలకు గతంలో అందుబాటులో లేని మరికొన్ని వ్యాధులకు చికిత్స అందించడం జరుగుతుందన్నారు. సైకిల్, స్కూటీలు ఇస్తామనడం ఉచిత హామీల లెక్కలోకి రావా అని ప్రశ్నించినప్పుడు, పాఠశాలలకు వెళ్లే ఆడపిల్లలను ప్రోత్సహించాలన్నదే తమ ఉద్దేశమని ఆయన సమాధానమిచ్చారు. బీజేపీ తిరిగి హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి వస్తుందనడంలో సందేహం లేదన్నారు. రోడ్లు, రైళ్లు, ఆరోగ్యం, విద్య, నీళ్లు ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని, వీటికి తోడు తాము చేపట్టిన సాంఘిక సంక్షేమ పథకాలు చాలా పెద్ద సక్సెస్ అయ్యాయని చెప్పారు. గతంలో సాధించిన దాని కంటే ఎక్కువ సీట్లు ఈసారి ఎన్నికల్లో సాధిస్తామని, 44కు పైగా సీట్లు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో రికార్డు స్థాయి గెలుపు..

గుజరాత్‌లో గత 30 ఏళ్లలో సాధించిన రికార్డును ఈసారి అధిగమిస్తామని అనురాగ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ విజయం చారిత్రాక విజయం అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రధానమత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి పనులు, డబుల్ ఇంజన్ ప్రభుత్వం సాధించిన విజయాలు అందరి అభినందనలు అందుకుంటున్నాయని చెప్పారు.

ఇద్దరూ ఇద్దరే..

అనురాగ్ ఠాకూర్ తండ్రి ప్రేమ్ కుమార్ థుమాల్ రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం, నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా కొనసాగుతుండటాన్ని ప్రస్తావిస్తూ ఇద్దరిలో ఎవరూ స్ట్రిక్ట్ అని ప్రశ్నించగా, ఇద్దరూ అంకితభావం కలవారని అనురాగ్ ఠాకూర్ సమాధానమిచ్చారు. ఇద్దరూ దేశం పట్ల, చేసే పనిపట్ల అంకితభావం కలిగిన వారని, వారి దృఢసంకల్పం, అంకితభావం కారణంలో జీవితంలో అనేక విజయాలు సాధించారని అన్నారు.

Updated Date - 2022-11-09T16:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!