ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Results: ఆప్‌కు జాతీయ పార్టీ హోదా: కేజ్రీవాల్

ABN, First Publish Date - 2022-12-08T18:17:18+05:30

గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవడంతో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా లభించినట్టయిందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఖాతా తెరవడంతో తమ పార్టీకి జాతీయ పార్టీ హోదా (National party status) లభించినట్టయిందని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు. గుజరాత్ ఎన్నికల్లో 'ఆప్' 5 స్థానాల్లో గెలుపొందిన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆప్‌ను జాతీయ పార్టీ స్థాయికి తేవడంలో సహకరించిన గుజరాత్ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చట్టప్రకారం తమ పార్టీ జాతీయ స్థాయి హోదా పొందడానికి గుజరాత్ ఎన్నికల్లో పోలైన ఓట్ల సంఖ్య సరిపోతుందని అన్నారు.

''దేశంలో జాతీయ స్థాయి హోదా పొందిన పార్టీలు చాలా కొద్దిగా ఉన్నాయి. ఆప్‌ ఇప్పుడు జాతీయ పార్టీ హోదా కేటగిరిలో చేరింది'' అని ఆయన అన్నారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో...ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉందని, గుజరాత్ ఎన్నికలతో తమ పార్టీ జాతీయ హోదాకు చేరిందని అన్నారు. గుజరాత్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిసారి తనను ప్రజలెంతగానో ఆదరించారని, గుజరాత్ ప్రజల ప్రేమ, ఆదరణకు మరిచిపోలేనని చెప్పారు.

''బీజేపీకి కంచుకోట గుజరాత్ అని చెబుతుంటారు. 13 శాతం ఓట్లు సాధించడం ద్వారా ఆ కంచుకోటకు బీటలు పడేలా చేశాం. 39 లక్షలకు పైగా ఓట్లు గెలిచాం. మా పార్టీ ఎంతగా ప్రజల విశ్వాసం చూరగొందనేది సాధించిన ఓట్ల శాతం ప్రతిబింబిస్తోంది'' అని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2022-12-08T18:17:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising