ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat polls: తొలి విడత ఎన్నికల ప్రచారానికి తెర

ABN, First Publish Date - 2022-11-29T19:21:55+05:30

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. డిసెంబర్ 1న తొలి విడత పోలింగ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat polls) తొలి విడత (First Phase) ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం తెరపడింది. డిసెంబర్ 1న తొలి విడత పోలింగ్ జరుగనుంది. గెలుపే లక్ష్యంగా బీజేపీ (BJP), కాంగ్రెస్‌ (Congress) ప్రచారం సాగించగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం పక్కా వ్యూహరచనతో ప్రచారం సాగించింది. ఇతర పార్టీలు కూడా ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది అభ్యర్థులను బరిలోకి దింపి తమ ఉనికిని చాటుకోవాలని అనుకుంటున్నాయి.

గెలుపుపై ఎవరి ఆశలు వారివే...

గుజరాత్‌లో 27 ఏళ్లుగా పాలన సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారం నిలుపుకొనేందుకు హోరాహోరీ ప్రచారం సాగించింది. సుదీర్ఘ కాలం పాలించిన బీజేపీతో జనం విసిగిపోయారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసివచ్చి ఈసారి అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ ఆశాభావంతో ఉంది. 2017 ఎన్నికల్లో ఖాతా కూడా తెరవని ఆమ్ ఆద్మీ పార్టీ ఇటీవల పంజాబ్‌లో సాధించిన ఘన విజయంతో గుజరాత్‌పై గట్టి ఆశలే పెట్టుకుంది. 90కి పైగా సీట్లు గెలిచి గుజరాత్‌లో అధికారంలోకి వస్తామని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ తరఫున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎంలు ఎన్నికల ప్రచారం సాగించగా, భారత్ జోడో యాత్రలో ఉన్నందున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొద్ది సమయం మాత్రమే ప్రచారానికి వెచ్చించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అశోక్ గెహ్లాట్ తదితరులు ఎన్నికలు ప్రచారం సాగించారు. ఆప్ నుంచి ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తదితరులు ప్రచారం సాగించారు. ఆప్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కేజ్రీవాల్ కోరారు.

తొలి విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: ఈసీ

డిసెంబర్ 1వ తేదీన జరిగే తొలి విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి పి.భారతి తెలిపారు. 19 జిల్లాల్లో పోలింగ్ జరగనుందని, పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, 50 శాతం పోలింగ్ బూత్‌లతో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. కేంద్ర పారామిలటరీ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు మధ్య ప్రశాంతంగా ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు జరిగినట్టు తెలిపారు. తొలి విడత పోలింగ్‌లో 2,39,76,760 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని ఆమె చెప్పారు. కాగా, రెండు విడతల పోలింగ్‌లో భాగంగా చివరి విడత పోలింగ్ డిసెంబర్ 5న జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-11-29T19:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising