Gujarat Election: అలా కాకుంటే..సిటీకో ఆఫ్తాబ్ పుడతాడు..
ABN, First Publish Date - 2022-11-19T14:11:21+05:30
ఇరవై ఆరేళ్ల శ్రద్ధా వాకర్ అత్యంత పాశవికంగా హత్యకు గురైన విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో..
న్యూఢిల్లీ: ఇరవై ఆరేళ్ల శ్రద్ధా వాకర్ (Sraddha Walkar) అత్యంత పాశవికంగా హత్యకు గురైన విషయాన్ని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ (Himanta Biswa sarma) గుజరాత్ ఎన్నికల (Gujarat Election) ప్రచారంలో ప్రస్తావించారు. దేశంలో బలమైన నాయకుడు లేకపోతే అఫ్తాబ్ (Ameen poonawala) వంటి వ్యక్తి ప్రతి సిటీలో పుడుతూనే ఉంటాడని, అప్పుడు సమాజాన్ని మనం కాపాడుకోలేమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్రంలో మూడోసారి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లవ్ జిహాదీ కుట్రలో భాగమే శ్రద్ధా వాకర్ దారుణ హత్య అని అన్నారు.
''శ్రద్ధా బెహన్‌ను అఫ్తాబ్ ముంబై నుంచి తెచ్చి లవ్ జీహాద్ పేరుతో 35 ముక్కులుగా నరికి చంపాడు. మృతదేహాన్ని ఎక్కడ ఉంచాడు? ఒక ఫ్రిజ్‌లో. మృతదేహం ఫ్రిజ్‌లో ఉండగానే మరో అమ్మాయిని ఇంటికి తెచ్చుకుని డేటింగ్ చేశాడు. దేశాన్ని తల్లిలా భావించే ఈ దేశానికి ఒక శక్తివంతుడైన నాయకుడు లేకపోతే, ప్రతి సిటీలోనూ ఇలాంటి అఫ్తాబ్‌లు పుడుతూనే ఉంటారు. అప్పుడు సమాజానికి రక్షణంటూ ఉండదు. ఆ దృష్ట్యా 2024లో నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా ఎన్నుకోవడం చాలా ముఖ్యం'' అని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 1,5వ తేదీల్లో జరుగనుంది. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2022-11-19T16:35:04+05:30 IST