Gujarat Election 2022: గుజరాత్‌లో 25 వేల మంది ముందస్తు అరెస్ట్
ABN, First Publish Date - 2022-11-17T16:41:20+05:30
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Election 2022) మొదటి దశ పోలింగ్‌కు ఇంకా పక్షం రోజులే సమయముంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అహ్మదాబాద్/సూరత్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల (Gujarat Election 2022) మొదటి దశ పోలింగ్‌కు ఇంకా పక్షం రోజులే సమయముంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక ఎన్నికల సంఘం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లపై దృష్టిసారించారు. డబ్బు, మద్యం ప్రభావాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తేదీ నవంబర్ 3 నుంచి ఇప్పటివరకు 25,000 లకుపైగా మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఎక్కువమంది కత్తులు లేదా కర్రలు కలిగివున్నవారేనని పోలీసులు తెలిపారు. వీరంతా వేర్వేరు కేసుల్లో అరెస్టవ్వడం లేదా డబ్బు లేదా మద్యం పంపిణీ చేసిన చరిత్ర ఉందని వెల్లడించారు.
కాగా అరెస్టైనవారిలో ఎక్కువమంది అహ్మదాబాద్, గుజరాత్ నగరాలకు చెందినవారే. ఓటర్ల భద్రత, స్వచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలానుసారం వీరిని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. సీఆర్‌పీసీ, ప్రివెన్షన్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ యాక్ట్(పాసా)లోని పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని ప్రధాన నగరాల్లో సూరత్‌లో అత్యధికంగా 12,965 అరెస్టులు జరగగా.. ఆ తర్వాత అహ్మదాబాద్‌లో 12,315 మంది అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక వడోదరలో 1600 ముందస్తు అరెస్టులు జరిగాయి.
Updated Date - 2022-11-17T16:41:27+05:30 IST