Gujarat polls: స్టార్ క్యాంపెయినర్లలో నితిన్ గడ్కరి, విజయ్ రూపానీ
ABN, First Publish Date - 2022-11-11T19:43:59+05:30
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి..
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat polls) స్టార్ క్యాంపెయినర్ల జాబితా (Star campaigners)ను బీజేపీ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి ఈ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర మంత్రులు అర్జున్ ముండే, స్మృతి ఇరానీ ఈ జాబితాలో చోటు చేసుకున్నారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ పాటిల్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవిస్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. విజయ్ రూపానీ, నితిన్ పటేల్ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి.
Updated Date - 2022-11-11T19:44:01+05:30 IST