ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat results: గుజరాత్‌లో బీజేపీ చరిత్రాత్మక విజయానికి అతిపెద్ద కారణం ఇదేనా!

ABN, First Publish Date - 2022-12-08T17:26:40+05:30

లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్స్‌గా విశ్లేషించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Election results) అధికార బీజేపీ (BJP) చరిత్రాత్మక విజయాన్ని లిఖించింది. 150కిపైగా స్థానాలను కైవశం చేసుకుని ఏకంగా ఏడవసారి అధికారాన్ని చేజిక్కించుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ-ఫైనల్స్‌గా విశ్లేషించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Election results) అధికార బీజేపీ (BJP) చరిత్రాత్మక విజయాన్ని లిఖించింది. 150కిపైగా స్థానాలను కైవశం చేసుకుని ఏకంగా ఏడవసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. గుజరాత్ మళ్లీ బీజేపీదేనని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించినా.. అంచనాలను మించి మరీ బీజేపీ సీట్లు గెలుచుకుంది. బీజేపీకి ఈ స్థాయి విజయం దక్కడానికి గుజరాత్‌‌లో ముస్లిం ఓట్లు చీలడమే కారణమా?.. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజక వర్గాలే ఇందుకు ప్రతిబింబమా ? అంటే ఔననే సమాధానాలొస్తున్నాయి. రాష్ట్రంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న సీట్లు 12-17 వరకు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవి. కానీ ఈసారి బీజేపీ గణనీయంగా సీట్లు పెంచుకుంది.

ఈ నియోజకవర్గాల పరిధిలో బీజేపీ కనీసం ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా బరిలో దింపలేదు. అయినప్పటికీ కాంగ్రెస్ గెలవాల్సిన చోట్ల సునాయాసంగా విజయాలను సొంతం చేసుకుంది. ఆప్, ఎంఐఎం బరిలో నిలవడంతో కాంగ్రెస్ ఓట్లకు భారీగా గండిపడింది. ఉదాహరణగా దరియాపుర్ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇది ముస్లిం ఓటర్ల ప్రాబల్యం ఎక్కువగా సీటు. ఇక్కడి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్యసుద్దీన్ షేక్ ఈసారి బీజేపీ అభ్యర్థి కౌసిక్ జైన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆదరణ ఉన్న నేతే అయినప్పటికీ ఓటమి తప్పలేదు. దీనినిబట్టి కాంగ్రెస్ ఓట్లను ఆప్, ఎంఐఎం పార్టీలు ఏ స్థాయిలో చీల్చాయో అర్థంచేసుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెత్త ఓటమి వెనుక ఆప్ (APP), అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జే థాకూర్ ఆరోపించిన విషయం తెలిసిందే. ‘‘ కాంగ్రెస్‌ ఓటు షేర్ తగ్గడానికి ఆప్, ఒవైసీలు ఒక కారణమనేది సత్యం. ఘోర ఓటమిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి వైఫల్యాలను విశ్లేషించుకుంటాం. తదుపరి ప్రభుత్వం వాగ్దాలను నెరవేరుస్తుంది ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ 16 నియోజక వర్గాల్లో ఆప్ అభ్యర్థులను బరిలో ఉన్నప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అయితే ఎంఐఎం కలిసి భారీ ఓట్లు చీల్చడంలో ఆప్ కీలకపాత్ర పోషించింది. ఎంఐఎం విషయానికి వస్తే ఈ నియోజక వర్గాల పరిధిలో ఇద్దరు నాన్-ముస్లిం సహా మొత్తం 13 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. పర్యవసనంగా కాంగ్రెస్‌ కీలక నేతలు కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషణలున్నాయి.

Updated Date - 2022-12-08T17:26:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising