ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gujarat Polls: గుజరాత్ ఎన్నికలకు ఆ గండం తప్పదా..?

ABN, First Publish Date - 2022-11-08T20:08:18+05:30

అహ్మదాబాద్: శూన్య మాసం, గ్రహణాలతో కొద్ది కాలంగా ముహూర్తాలు లేక అల్లాడుతున్న వారికి డిసెంబర్‌‌ మాసం ఒకింత ఊరట కలిగించబోతోంది. ఆ మాసంలో వచ్చే శుభ ముహూర్తాల కోసం, కల్యాణ మండపాల బుకింగ్‌ల కోసం ఇప్పటికే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: శూన్య మాసం, గ్రహణాలతో కొద్ది కాలంగా ముహూర్తాలు లేక అల్లాడుతున్న వారికి డిసెంబర్‌‌ మాసం ఒకింత ఊరట కలిగించబోతోంది. ఆ మాసంలో వచ్చే శుభ ముహూర్తాల కోసం, కల్యాణ మండపాల బుకింగ్‌ల కోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు కాగా, గుజరాత్ నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. అటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం, ఇటు శుభముహూర్తాల తరుణం ఏకకాలంలో రావడం వీరిని బెంబేలెత్తిస్తోంది. ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ఉండటంతో ఓటర్లను మంచి చేసుకునేందుకు నాయకులు ఇప్పట్నించే తలమునకలవుతున్నారు. మీ ఇంట్లో శుభానికి మేము అండగా ఉంటామని భరోసా ఇస్తూనే, ఓటర్ల పండుగలో పాలుపంచుకుని ఆశీర్వదించమంటూ ఓటర్ల వెంట పడుతున్నారు.

ఎన్నికలు, శుభ ముహూర్తం తేదీలివే...

షెడ్యూల్ ప్రకారం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా డిసెంబర్ 1, 5వ తేదీల్లో జరుగనున్నాయి. డిసెంబర్ 8వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఇక, పెళ్లి ముహూర్తాలు పెట్టే సిద్ధాంతులు సైతం ఈ రోజులను కీలకంగానే భావిస్తున్నారు. డిసెంబర్ 2, 4, 8 తేదీలు అత్యంత శుభదాయకమైన ముహూర్తాలుగా పండితులు చెబుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ నవంబర్ 22 నుంచి మొదలై డిసెంబర్ 16న 'కముర్త' పీరియడ్ మొదలు కావడానికి ముందు వరకూ మాత్రమే ఉంటుంది. 16వ తేదీ తర్వాత ముహర్తాలకు అనుకూల సమయం కాదని పండితులు చెబుతున్నారు. నవంబర్ 28, 29, డిసెంబర్ 2,4,8 తేదీల్లో అత్యద్భుతమైన ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆయా తేదీల్లో పెద్ద సంఖ్యలో ముహూర్తాలు నిశ్చయమవుతున్నాయి.

రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?

ఎన్నికల తరుణం, పెళ్లిళ్ల సీజన్ ఏకకాలంలో రావడంపై గుజరాత్ కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ దోషి స్పందిచారు. పెళ్లిళ్లు ముందుగానే జనం నిర్ణయించుకుంటారని, ఎన్నికల కోసం వాటిని వాయిదా వేసుకోరని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో నేరుగా ఓటర్లను కలిసి, ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని కోరుతామని, పోలింగ్ తేదీ రోజు ఏదో ఒక సమయంలో వీలు చూసుకుని ఓటు వేసి వెళ్లాల్సిందిగా నచ్చచెబుతామని చెప్పారు. మంచి నేతను ఎన్నుకోవడమనే సామాజిక బాధ్యతను ఓటర్లకు వివరించి ఓటు వేయాల్సిందిగా కోరుతామని 'ఆప్' ప్రతినిధి కరణ్ బరోట్ తెలిపారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 89 స్థానాలకు డిసెంబర్ 1న ఎన్నికలు జరుగనుండగా, 93 స్థానాల్లో డిసెంబర్ 5న పోలింగ్ జరుగుతుంది.

Updated Date - 2022-11-08T20:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising