Childrens: చలికాలంలో కొన్ని జాగ్రత్తలు
ABN, First Publish Date - 2022-11-30T14:58:39+05:30
చలికాలమంటే చాలు ఎవరికైనా వణుకే. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, చర్మసంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలెక్కువ. అందుకే చిన్నపిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
చలికాలమంటే చాలు ఎవరికైనా వణుకే. వైరల్ ఇన్‌ఫెక్షన్లు, చర్మసంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలెక్కువ. అందుకే చిన్నపిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పెద్దలకంటే పిల్లలు చర్మం మృదువుగా, సున్నితంగా ఉంటుంది కాబట్టి చలిగాలి బారిన పడి చర్మం పగలటం, చర్మంపై దద్దుర్లు, చర్మం పొడిబారటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మాయిశ్చరైజర్లను ప్రతిరోజూ రాత్రిపూట రాయాలి. వాసనలు ఎక్కువగా, హాని చేసే రంగుల క్రీములను వాడకండి.
చిన్నపిల్ల పెదవులు పగలటం, మూతి చివర్లో మంటలు రాకుండా ఉండాలంటే వ్యాజిలీన్ రాయాలి.
డైపర్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సరైన సమయంలో చెక్ చేసుకోకపోతే చలికాలంలో ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉంది. పొరబాటున కూడా చల్లని ఆహారం, చల్లనీళ్లు తాగించకూడదు. దీనివల్ల జలుబు, దగ్గు బారిన పడకుండా ఉంటారు. ఎప్పుడూ తాజా ఆహారాన్నే తినిపించాలి.
పండ్లరసాలు, ఐస్‌క్రీమ్స్, కేక్స్‌లాంటి ఫుడ్‌కు దూరంగా ఉంచటం మంచిది.
ఎక్కువ సమయం స్నానం చేయించకూడదు. త్వరగా శరీరాన్ని పొడి గుడ్డతో తుడవాలి. పొడిగా ఉండే దుస్తులనే వేయాలి. నిద్రపోయేప్పుడు ఉన్ని దుస్తులను కచ్చితంగా వేయాలి. దీన్ని వల్ల చలినుంచి రక్షణ కలుగుతుంది.
శరీరంపై విపరీతంగా ర్యాషెస్, తెల్లటి మచ్చల్లాంటివి కనపడితే వెంటనే చర్మనిపుణులను సంప్రదించాలి.
Updated Date - 2022-11-30T14:58:40+05:30 IST