ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gym: యువత దృష్టి మారింది

ABN, First Publish Date - 2022-12-03T16:16:48+05:30

సినిమాలు, షికార్లు పక్కన పెట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఉదయాన్నే నిద్రలేవగానే జిమ్‌కు పరుగులు తీస్తున్నారు. యువత అభిరుచికి తగినట్లుగా జిమ్‌సెంటర్ల నిర్వాహకులు ప్రత్యేక శిక్షకులతో

యువత దృష్టి మారింది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోజుకు ఓ గంట

ఆరోగ్యమే మహాభాగ్యమంటున్న పౌరులు

ఫిట్‌నెస్‌ సెంటర్లకు క్యూ

శరీరాకృతి, ఆరోగ్యంపై ఫోకస్‌

నేడు అధికశాతం మంది యువత శరీర ఫిట్‌నెస్‌పై మక్కువ చూపుతున్నారు. సిక్స్‌ ప్యాక్‌ కోసం ఆరాట పడుతున్నారు. అందుకోసం రోజూ ఓ గంట సమయాన్ని కేటాయిస్తున్నారు. సినిమాలు, షికార్లు పక్కన పెట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఉదయాన్నే నిద్రలేవగానే జిమ్‌కు పరుగులు తీస్తున్నారు. యువత అభిరుచికి తగినట్లుగా జిమ్‌సెంటర్ల నిర్వాహకులు ప్రత్యేక శిక్షకులతో వారికి శిక్షణ ఇస్తున్నారు.

మాదాపూర్‌, హైటెక్‌సిటీ, మియాపూర్‌, చందానగర్‌, రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్‌, లింగంపల్లి ప్రాంతాల్లో జిమ్‌, ఫిట్‌నెస్‌ సెంటర్లకు యువత క్యూ కడుతున్నారు. యువత అభిరుచి మేరకు జిమ్‌ సెంటర్ల నిర్వాహకులు శిక్షణ ఇస్తున్నారు. సన్నగా ఉండేవారు ధృడంగా తమ శరీరాకృతిని పెంచుకునేందుకు కసరత్తు చేస్తుండగా, లావుగా ఉన్నవారు పొట్ట నడుము, ఇతర అవయువాల్లో పేరుకుపోయిన కొవ్వును తగ్గించేందుకు జిమ్‌ సెంటర్లకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి వ్యాయామం చేస్తున్న యువతలో ఎక్కువ ఫలితం కనిపించడంతో జిమ్‌లకు వచ్చేవారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రస్తుతం జిమ్‌లను నడపడం నిరుద్యోగ యువతకు ఉపాధిమార్గంగా మారింది. జిమ్‌లకు వచ్చే యువత శరీరాకృతి వృద్ధి చేసుకునేందుకు వ్యాయామశాలలు ఎంతగానో దోహదపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.

ఆరోగ్యం లేకుంటే వ్యర్థమే

రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తాను. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ శరీరంపై శ్రద్ధచూపాలి. వ్యాయామం చేస్తే రోగాలు ధరిచేరకుండా ఉంటాయి. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకుంటే వ్యర్థమే. అందుకోసం కనీసం ఒక గంటపాటు వ్యాయామం చేయాలి.

ఫిట్‌నెస్‌తోనే..

ప్రతి ఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగాలి. శరీరాన్ని మన అభిరుచికి తగినట్లుగా మలుచుకోవాలి. అప్పుడే రోగాలు ధరిచేరవు. సన్నగా ఉన్న వ్యక్తులు జిమ్‌లో చేరి శిక్షకుల సలహాల మేరకు వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తే శరీర దారుఢ్యాన్ని సాధిస్తారు. అప్పుడు చురుకుగా ఉంటా రు. బద్ధకం మన ధరిచేరదు. ప్రతి ఒక్కరికి ఎత్తు, వయసుకు తగిన బరువు ఫిట్‌నెస్‌తోనే వస్తుంది.

తింటున్నారు.. వ్యాయామం మరిచారు..

ఏడాది నుంచి జిమ్‌ చేయడం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరింది. పెద్దగా ఉన్నపొట్ట తగ్గింది. నేడు ఎక్కువ మంది ఇష్టానుసారంగా ఆహారం తింటున్నారు. దానికి దగ్గ వ్యాయా మం చేయడంలేదు. దీంతో బరువు పెరిగి ఊబకాయం వస్తోంది. రోజూ వ్యాయామం చేస్తే శరీరం ఎంతో ఫిట్‌గా ఉంటుంది. శరీరాకృతి ఆకర్షణీయంగా మారుతుంది.

హైదరాబాద్, మాదాపూర్‌, డిసెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి)

Updated Date - 2022-12-03T16:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising