వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలంటే..!
ABN, First Publish Date - 2022-11-08T12:19:22+05:30
వ్యాయామం చేయాలని ఎంత పట్టుదలగా ఉన్నా, అందుకు కట్టుబడి ఉండడానికి ఎన్నో అంశాలు అడ్డుపడుతూ ఉంటాయి. అలా జరగకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
వ్యాయామం చేయాలని ఎంత పట్టుదలగా ఉన్నా, అందుకు కట్టుబడి ఉండడానికి ఎన్నో అంశాలు అడ్డుపడుతూ ఉంటాయి. అలా జరగకుండా క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.
ప్రతి సోమవారం తప్పనిసరిగా వ్యాయామం చేయాలి
వరుసగా రెండు రోజుల పాటు వ్యాయామం చేయకుండా ఉండకూడదు
వ్యాయామానికీ, వెయిట్‌లాస్‌కూ లింకు పెట్టుకోకూడదు. బరువుతో సంబంధం లేకుండా వ్యాయామం చేయాలి
వ్యాయామానికి అడ్డుపడే అంశాలను విశ్లేషించి, పరిష్కారం కనుగొనాలి
ఎప్పుడో ఒకసారి చేసే పని కంటే, రోజూ చేసే పని వల్ల ఫలితం ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుని, దాన్ని వ్యాయామానికి కూడా అన్వయుంచుకోవాలి
ఒకే వ్యాయామంతో బోర్ కొడితే, ఈత, సైక్లింగ్, క్రీడలు, డాన్స్.. ఇలా నచ్చినదాన్ని ఎంచుకోవాలి
వ్యాయామాన్ని నచ్చిన అంశంతో ముడిపెట్టాలి. మ్యూజిక్ మీకిష్టమైతే, నచ్చిన పాటలు వింటూ వ్యాయామం చేయాలి.
Updated Date - 2022-11-08T12:20:03+05:30 IST