ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువు తగ్గేందుకు ఈ చిట్కాలు పాటించండి

ABN, First Publish Date - 2022-11-08T11:13:02+05:30

బరువు తగ్గాలంటే తక్కువ తినాలి, ఎక్కువ వ్యాయామం చేయాలి అనుకుంటాం. కానీ కొన్ని జీవనశైలి మార్పులను కూడా అనుసరించినప్పుడే మెరుగైన ఫలితం దక్కుతుంది.

ఈ చిట్కాలు పాటించండి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రువు తగ్గాలంటే తక్కువ తినాలి, ఎక్కువ వ్యాయామం చేయాలి అనుకుంటాం. కానీ కొన్ని జీవనశైలి మార్పులను కూడా అనుసరించినప్పుడే మెరుగైన ఫలితం దక్కుతుంది.

ప్రొటీన్‌: రోజు మొత్తంలో తీసుకునే ప్రొటీన్‌ పరిమాణాన్ని రెట్టింపు చేయాలి. ప్రొటీన్‌తో ఆకలి తగ్గి, ఎక్కువ సమయం పాటు హుషారుగా ఉంటాం.

నిద్ర: నిద్రలేమితో త్వరగా బరువు పెరిగిపోతాం. కాబట్టి కంటి నిండా నిద్రపోవాలి.

కూరగాయలు: వీలైనన్ని ఎక్కువ కూరగాయలు తినాలి. ఇలా తినడం వల్ల ఎక్కువ సమయం పాటు పొట్ట నిండుగా ఉండి, చిరుతిళ్ల మీదకు మనసు మళ్లకుండా ఉంటుంది.

నడక: పెంపుడు కుక్కలను తరచూ నడకకు తీసుకువెళితే, అదనపు వ్యాయామం దక్కి, త్వరగా బరువు తగ్గుతాం.

కూల్‌డ్రింక్స్‌: శీతల పానీయాలతో ఊబకాయం వస్తుంది. వీటికి బదులు పండ్ల ముక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ నీళ్లను తాగడం మేలు.

హ్యాపీ అవర్స్‌: రాత్రి భోజనం తర్వాత, స్నేహితులతో కలిసి ఆరుబయట సరదాగా పరుగులు పెట్టండి. లేదా ఆటలు ఆడండి. ఈ పనులన్నీ అధిక బరువును కరిగించేవే!

డాన్స్‌: డాన్స్‌ క్లాస్‌లో చేరితే, కార్డియో ఫలితం దక్కి, అధిక బరువు కోల్పోతాం. మనసు కూడా హుషారుగా మారుతుంది.

ఇంటి వంట: సాధ్యమైనంత వరకూ ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా మనమే వంట చేసుకుంటే, దాన్లో ఉపయోగించే దినుసులు, నూనెల మీద మనకు నియంత్రణ ఉంటుంది.

Updated Date - 2022-11-08T11:13:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising