Keratosis pilaris : ఈ వ్యాధితో బాధపడుతున్నారా? దీనికి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలంటే..!
ABN , First Publish Date - 2022-11-07T11:37:35+05:30 IST
ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. వెంట్రుకల కుదుళ్లు పెరగకుండా చేస్తుంది.
శీతాకాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, పగుళ్ళు ఇటువంటి సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ శీతాకాలం మరిన్ని అనారోగ్య సమస్యలు తెస్తుంది. వాటిలో ముఖ్యమైనది కెరటోసిస్ పైరాలిస్ కెరాటిన్, ఇది కెరాటిన్ ఏర్పడటం వల్ల వస్తుంది. ఇది చర్మ రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. వెంట్రుకల కుదుళ్లు పెరగకుండా చేస్తుంది. దీనితో చర్మంపై చిన్న చిన్న గడ్డలు వస్తాయి. చూడడానికి ఇవి మొటిమల్లాగా కనిపిస్తాయి. కెరటోసిస్ పిలారిస్ ఎక్కువగా చేతులపైన, కొన్నిసార్లు తొడలపైనా కనిపిస్తుంది. ఇది ఎరుపు, గోధుమ, పసుపు రంగులలో కనిపిస్తుంది.
శీతాకాలం.. కాలానుగుణంగా మన శరీరంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. వాతావరణం మారుతున్న కొద్దీ శరీరం దానికి తగినట్టుగా మార్పులు చెందుతూ ఉంటుంది. పొడి, చల్లని వాతావరణ పరిస్థితుల్లో మరింత తీవ్రంగా కనిపించే కెరటోసిస్ పిలారిస్ సమస్య తీవ్రమవుతుంది. ఎందుకంటే చల్లని వాతావరణం తేమను కోల్పోతుంది. అయితే కొందరు వేసవి, వర్షాకాలాల్లో కూడా ఈ సమస్యను ఎదుర్కుంటూ ఉంటారు. ముఖ్యంగా వీరిలో ఇతర అలెర్జీలు ఉండటం కూడా కారణం కావచ్చు.
కెరాటోసిస్ పిలారిస్ లక్షణాలు...
పొడి చర్మం, ఎర్రటి, పింక్ ఆకారంలో మొటిమల్లాంటి సమస్య ఉంటుంది. చర్మం దురదగా ఉంటుంది. స్కిన్ టోన్ కారణంగా వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటుంది.
కెరటోసిస్ పిలారిస్ చికిత్స, నివారణలు..
చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయండి.
కెరటోసిస్ పిలారిస్ ఈ పరిస్థితిని నివారించడానికి చర్మాన్ని క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయడం అవసరం. దీని కోసం తేలికపాటి, రసాయనాలు అధికంగా ఉండే ఉత్పత్తులను ఉపయోగించాలి, ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.
చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోండి
కెరటోసిస్ పైలారిస్‌ను తగ్గించడానికి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం అవసరం. దీనికోసం లాక్టిక్ యాసిడ్ ను వాడటం వ్లల అది చర్మాన్ని తేమగా మార్చడానికి పనిచేస్తుంది. దీనితో పాటు హ్యూమెక్టెంట్ పదార్థాలను ఉపయోగించవచ్చు, ఇది చర్మంలో తేమను ట్రాప్ చేస్తుంది.
ఈ పదార్థాలను కూడా జాగ్రత్తగా వాడండి.
కెరటోసిస్ పైలారిస్‌ను తగ్గించడానికి, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ సమాన మొత్తంలో ఉండే క్రీములను ఉపయోగించవచ్చు. ఇవన్నీ కలిసి చర్మాన్ని వదులుగా చేసి మృతకణాలను బయటకు పంపుతాయి.
Read more