Want to gain weight fast : త్వరగా బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.

ABN , First Publish Date - 2022-11-07T12:53:13+05:30 IST

బరువు పెరగడానికి కూడా అంతే పద్దతులను పాటిస్తూ, సరైన ఆహారపదార్ధాలను తీసుకోవలసి ఉంటుంది.

Want to gain weight fast : త్వరగా బరువు పెరగాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి.
gain weight

బరువు తగ్గాలనుకోవడం ఎంత సమస్యగా మారిందో అలాగే బరువు పెరగడం కూడా అంతే సమస్యగా మారింది. బరువు పెరగాలనుకోవడం, కండరాలను దృఢంగా చేసుకోవడం కూడా పెద్ద విషయమే.. దానికోసం ఏది పడితే అది తినేసినా పెద్దగా లాభం కనిపించకపోవచ్చు. శరీరం సన్నబడటం కూడా ఒక సమస్యే. బరువు పెరగడం వల్ల ఏవిధంగా అనారోగ్య సమస్యలు వస్తాయో.. బరువు తగ్గడం వల్ల కూడా సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే బరువు పెరగడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బరువు తగ్గడానికి ఎంత పద్దతిగా తింటామో.. బరువు పెరగడానికి కూడా అంతే పద్దతులను పాటిస్తూ, సరైన ఆహారపదార్ధాలను తీసుకోవలసి ఉంటుంది. దీనికోసం పోషకాహారాన్ని తీసుకోవాలి. బరువు పెరగడానికి ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో తెలుసుకుదాం..

కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి:

బరువు పెరగడానికి తప్పకుండా రోజూ 2100 కిలో కేలరీలు తీసుకుంటే..సులభంగా బరువు పెరుగుతారు. బరువు పెరిగే క్రమంలో రోజూ 1000 కిలో కేలరీల కంటే ఎక్కువ తీసుకోవచ్చు. కాబట్టి బీట్‌రూట్, మొలకలు, దానిమ్మ వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. వీటితో పాటు చీజ్, డార్క్ చాక్లెట్, అవకాడో ఆరోగ్యంగా బరువు పెరగడంలో సహాయపడతాయి.

1. చీజ్

చీజ్ ఆహారంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ల అద్భుతమైన ఫలితాలు శరీరానికి అందుతాయి. భోజనంలో కేలరీలు, రుచిని పెంచుకోవాలనుకుంటే చీజ్ చక్కని ఎంపిక అవుతుంది.

2. డార్క్ చాక్లెట్

బరువు పెరగడంలో సహాయపడే మరో ఆహార పదార్థం డార్క్ చాక్లెట్. ఇందులో కేలరీలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

3. అవకాడో

అవకాడో పోషకాలకు, మంచి రుచికి తగినట్టు ఉంటుంది. ఇందులో కొవ్వు పదార్థాలు నిండుగా ఉన్నాయి. ఇవి శరీరానికి మంచి ఫలితాలను ఇస్తాయి కనుక అవకాడోని ఇతర ఆహార పదార్థాలలో కలిపి తిన్నా కూడా మంచి ఫలితాన్ని అందుకోవచ్చు.

4. డ్రై ప్రూట్స్

మనం తీసుకునే ఆహారంలో డ్రైప్రూట్స్ తీసుకోవడం వల్ల ఇందులోని క్యాలరీలు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఆహారంలో కేలరీలను పెంచడానికి ఉపయోగ పడతాయి.

5. బంగాళ దుంపలు, పిండి పదార్థాలు

బంగాళ దుంపలను అధికంగా తీసుకోవడం వల్ల ఇవి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు కీలకమైన ఖనిజాలను, ఫైబర్ ను అందిస్తుంది. కండరాలలో గ్లైకోజెన్ స్టోర్ ను పెంచడంలోను సహకరిస్తుంది.

Updated Date - 2022-11-07T14:00:32+05:30 IST

Read more