Yoga: ఇలా చేస్తే స్వల్ప రుగ్మతలు మాయం
ABN, First Publish Date - 2022-11-15T12:08:14+05:30
యోగ ముద్రలతో స్వల్ప రుగ్మతలను మనకు మనమే సరిదిద్దుకోవచ్చు. అలసట, బడలికలతో శరీరం చతికిలపడినప్పుడు, చేతి వేళ్లతో ఈ ముద్రను వేయడం వల్ల
యోగ ముద్రలతో స్వల్ప రుగ్మతలను మనకు మనమే సరిదిద్దుకోవచ్చు. అలసట, బడలికలతో శరీరం చతికిలపడినప్పుడు, చేతి వేళ్లతో ఈ ముద్రను వేయడం వల్ల అంతర్గత శక్తి, తేజస్సు ఉత్తేజితమవుతాయు. ఫలితంగా వ్యాధులతో పోరాడే శక్తి శరీరానికి సమకూరుతుంది. ఈ యోగ ముద్రను ఎలా వేయాలంటే...
పద్మాసనంలో కూర్చోవాలి.
అర చేతులను మోకాళ్ల మీద ఆనించాలి.
బొటన వేలు, ఉంగరపు వేలు, చిటికిన వేళ్లను బొమ్మలో చూపించిన విధంగా తాకించాలి.
చూపుడు వేలు, మధ్య వేలును చాపి ఉంచాలి.
కళ్లను మూసి, మనసును ప్రశాంతంగా ఉంచి, గాఢంగా శ్వాస తీసుకోవాలి.
ఈ ముద్రకు ఉదయమే అనువైన సమయం.
రోజులోని మిగతా సమయాల్లో ముద్ర వేయాలి అనుకుంటే, ఆహారం తీసుకున్న 30 నిమిషాల తర్వాతే ఈ ముద్రను సాధన చేయాలి.
ఈ ముద్రలో 15 నుంచి 20 నిమిషాల పాటు ఉండాలి.
రోజుకు మూడు సార్లు లేదా ఏకబిగిన 40 నిమిషాల పాటు కూడా సాధన చేయవచ్చు.
Updated Date - 2022-11-15T12:08:16+05:30 IST