ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rishi Sunak: ఆ స్వర్ణయుగం ముగిసిపోయింది..బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వ్యాఖ్య

ABN, First Publish Date - 2022-11-29T23:33:06+05:30

బ్రిటన్-చైనా సంబంధాల్లో స్వర్ణ యుగం ముగిసిపోయిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తాజాగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: బ్రిటన్-చైనా సంబంధాల్లో(Britain China Ties) స్వర్ణ యుగం ముగిసిపోయిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్(Rishi Sunak) తాజాగా వ్యాఖ్యానించారు. లండన్‌లో సోమవారం జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన..తొలిసారిగా తన విదేశాంగ విధానానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా విషయంలో ఆయన తన మునుపటి ధోరణికి భిన్నంగా దూకుడు ప్రదర్శించారు. ‘‘ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నా..ఆ స్వర్ణ యుగం ముగిసిపోయింది. వాణిజ్యంతో సామాజిక, రాజకీయ సంస్కరణలు సాధ్యమవుతాయన్న ఆలోచనకు కాలం చెల్లింది’’ అంటూ చైనాలో మానవహక్కుల ఉల్లంఘనల(Human right violations) గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

గత ప్రధాని లిజ్ ట్రస్(Lizz truss) లాగా చైనా విషయంలో దూకుడుగా వ్యవహరించట్లేదన్న ఆరోపణ రిషి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చైనాపై ఆయన తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. కాగా.. బ్రిటన్ విలువలు, ప్రయోజనాలకు చైనా తీరుతో సవాలు ఎదురవుతోందని కూడా రిషి పేర్కొన్నారు. తన శక్తియుక్తులన్నీ ఒడ్డుతూ చైనా..ప్రపంచంపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇటవల జరిగిన జీ20 సమావేశాల సందర్భంగా జరగాల్సిన చైనా, బ్రిటన్ అధినేతల సమావేశం కూడా రద్దైపోయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. బ్రిటన్ గవర్నమెంట్.. చైనా సీసీటీవీ కెమెరాలను ప్రభుత్వ భవనాల్లో నిషేధించింది.

Updated Date - 2022-12-01T00:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising