ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Halloween Stampede: తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై భారత్ దిగ్భ్రాంతి

ABN, First Publish Date - 2022-10-30T12:02:50+05:30

దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై

stampede in Seol
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సియోల్ : దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణ నష్టంపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపింది. ఈ కష్టకాలంలో దక్షిణ కొరియా ప్రభుత్వానికి సంఘీభావం తెలిపింది. ఈ సంఘటనపై ప్రపంచ దేశాలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం తెలిపాయి.

దక్షిణ కొరియాలో కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రభుత్వం ఇటీవలే ఆంక్షలను సడలించింది. దీంతో హాలోవీన్ (Halloween) సంబరాలను పెద్ద ఎత్తున జరుపుకొనేందుకు యువతీయువకులు బహిరంగ ప్రదేశాలకు తరలివచ్చారు. శనివారం రాత్రి సుమారు 1,00,000 మంది ఇటావోన్ ప్రాంతంలో ఒకే చోట చేరారు. వీరిలో అత్యధికులు 25 ఏళ్ళ లోపు వయస్కులే. ఇరుకైన మార్గంలో వీరంతా నడుస్తుండగా తొక్కిసలాట జరిగింది. హుటాహుటిన సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. రోడ్డుపై కుప్పకూలినవారికి సహాయక చర్యలు చేపట్టాయి.

స్థానికుల కథనం ప్రకారం, రోడ్లన్నీ ప్రజలు, వాహనాలతో క్రిక్కిరిసిపోయాయి. బాధితులను అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలించేందుకు చాలా కష్టపడవలసి వచ్చింది.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, 151 మంది ప్రాణాలు కోల్పోగా, 81 మంది గాయపడ్డారు. దక్షిణ కొరియా (South Korea) అధ్యక్షుడు యూన్ సుక్ యివోల్ ఆదివారం జాతీయ సంతాప దినంగా ప్రకటించారు. ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలపై జాతీయ జెండాను అవనతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సాయపడటానికే తన ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మృతుల అంత్యక్రియలకు, గాయపడినవారి చికిత్సకు ప్రభుత్వం సాయపడుతుందని చెప్పారు

ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) ట్విటర్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సియోల్‌లో జరిగిన తొక్కిసలాటలో చాలా మంది యువతీయువకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో కొరియా రిపబ్లిక్‌కు సంఘీభావం, మద్దతు తెలిపారు.

Updated Date - 2022-10-30T12:02:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising