ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Iran : పెల్లుబుకుతున్న నిరసనలు... యువతపై విరుచుకుపడుతున్న ఇరాన్...

ABN, First Publish Date - 2022-11-15T19:45:05+05:30

స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం ఇరానియన్లు తహతహలాడుతున్నారు. సామాజిక స్వేచ్ఛ, రాజకీయ

Protests in Iran
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెహ్రాన్ (ఇరాన్) : స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడం కోసం ఇరానియన్లు తహతహలాడుతున్నారు. సామాజిక స్వేచ్ఛ, రాజకీయ మార్పుల కోసం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువత సమరోత్సాహంతో వీథుల్లోకి వస్తోంది. 14 నుంచి 19 ఏళ్ళ బాలబాలికలు సైతం స్వేచ్ఛాస్వాతంత్ర్యాల కోసం పోరాటానికి దిగుతున్నారు. దీంతో ఇరాన్ అధికారులు వీరిపై ఉక్కుపాదం మోపుతున్నారని మానవ హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో నిందితులతో కలిపి నిరసనకారులను జైళ్ళలో ఉంచుతున్నారని, కొందరిని తీవ్రంగా కొడుతున్నారని చెప్తున్నారు.

అమెరికన్ మీడియా కథనం ప్రకారం, సగటున 15 ఏళ్ళ బాలబాలికలు వీథుల్లోకి వచ్చి, ఇరానియన్ భద్రతా దళాలతో ఘర్షణ పడుతున్నారు. విశ్వవిద్యాలయాలు, హైస్కూళ్ళలో కూడా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కొందరు నిరసనకారులను భద్రతా సిబ్బంది తీవ్రంగా కొట్టి, అరెస్టు చేస్తున్నారు. ఓ పద్నాలుగేళ్ళ బాలికను మాదక ద్రవ్యాల కేసులో నిందితులతో కలిపి జైలులో నిర్బంధించారు. ఓ బాలుడి ముక్కు పగులగొట్టారు.

అసమ్మతిని అణచివేసేందుకు అధికారులు విశ్వవిద్యాలయాలు, హైస్కూళ్ళపై దాడులు చేస్తుండటంతో వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 18 ఏళ్ళ లోపు వయసుగలవారిపై విరుచుకుపడుతున్నారు.

విద్యార్థినీ, విద్యార్థుల బంధువులు, మానవ హక్కుల కార్యకర్తలు వెల్లడించిన వివరాల ప్రకారం, కనీసం 50 మంది మైనర్లను భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం, దాదాపు 14 వేల మందిని ఇరానియన్ అధికారులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ భవనానికి నిప్పు పెట్టినందుకు ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించినట్లు ఇరానియన్ మీడియా తెలిపింది.

సెప్టెంబరులో మహసా అమిని అనే యువతి మోరలిటీ పోలీసుల కస్టడీలో ప్రాణాలు కోల్పోవడంతో ఇరాన్‌లో నిరసనలు పెల్లుబికిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మహిళల నాయకత్వంలో ఇరాన్ అంతటా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మత పెద్దల నేతృత్వంలోని పాలనకు తెరపడాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. గడచిన రెండు దశాబ్దాల్లో జరిగిన నిరసన కార్యక్రమాలపై విరుచుకుపడనంత తీవ్ర స్థాయిలో ఇరాన్ భద్రతా దళాలు ప్రస్తుతం యువతపై విరుచుకుపడుతున్నాయని మానవ హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. కాల్పులు జరపడం, కొట్టడం, చంపడం వంటి మార్గాలను భద్రతా దళాలు అనుసరిస్తున్నాయని మండిపడుతున్నారు. కొందరిని అరెస్ట్ చేసి, డిటెన్షన్ సెంటర్లలో నిర్బంధిస్తున్నట్లు తెలిపారు. బాలల కుటుంబ సభ్యులను కూడా బెదిరిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - 2022-11-15T19:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising