ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Iraq: ఇంధనం ట్యాంకు పేలి 11 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2022-11-18T16:58:31+05:30

సులైమానియా: నార్త్ ఇరాక్‌లోని సులైమానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధనం ట్యాంక్ పేలి 11 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఒక ఇల్లు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సులైమానియా: నార్త్ ఇరాక్‌ (Northern Iraq)లోని సులైమానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇంధనం ట్యాంక్ (Fuel tank) పేలి 11 మంది దుర్మరణం పాలయ్యారు. 13 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి ఒక ఇల్లు కుప్పకూలిపోయినట్టు స్థానిక అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగినట్టు సిటీ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ సమన్ నార్ తెలిపారు. ట్యాంకు నుంచి గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు చెప్పారు.

యుద్ధాలు తరచు చోటుచేసుకునే ఇరాక్‌లో మౌలిక వసతులు దెబ్బతిని, ప్రమాదాలు సర్వసాధారంగా మారాయి. ముఖ్యంగా రవాణా, నిర్మాణ రంగాల్లో భద్రతా ప్రమాణాలు దిగజారిపోయినట్టు చెబుతున్నారు. ఇంధనం ట్యాంకు పేలడంతో మూడంతస్తుల భవనం కుప్పకూలిందని, శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు 15 గంటలుగా సహాయక బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. మరో నలుగురు శిథిలాల క్రింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నామని చెప్పారు. కాగా, మృతులలో ఒక పిల్లవాడు ఉన్నట్టు సులైమానియా గవర్నర్ హవ్ అబు బకర్ తెలిపారు. శుక్రవారంనాడు సంతాపదినం ప్రకటించారు.

Updated Date - 2022-11-18T16:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising