Nancy Pelosi: యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్తపై హింసాత్మక దాడి
ABN, First Publish Date - 2022-10-28T19:48:28+05:30
యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) భర్త పాల్ పెలోసీ(Paul Pelosi)పై దాడి జరిగింది. శుక్రవారం ఉదయం
వాషింగ్టన్: యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ(Nancy Pelosi) భర్త పాల్ పెలోసీ(Paul Pelosi)పై దాడి జరిగింది. శుక్రవారం ఉదయం కాలిఫోర్నియాలోని నాన్సీ ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన దుండగుడు పాల్ పెలోసీపై దాడిచేశాడు. పాల్ పెలోసీపై హింసాత్మకంగా దాడి జరిగిందని నాన్సీ పెలోసీ కార్యాలయం తెలిపింది. దుండగుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడని, దాడి వెనక గల కారణాన్ని తెలుసుకునేందుకు విచారణ జరుగుతోందని కార్యాలయం తెలిపింది. దాడి అనంతరం పెలోసీని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారు. దాడి జరిగిన సమయంలో నాన్సీ పెలోసీ శాన్ ఫ్రాన్సిస్కోలో లేరని అధికారులు తెలిపారు. భర్తపై జరిగిన దాడిపై నానీ పెలోసీ ఇప్పటి వరకు స్పందించలేదు. దాడికి గల కారణంపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. నాన్సీ పెలోసీ-పాల్ పెలోసీకి 1963లో వివాహం జరిగింది.
అమెరికాలోని శక్తిమంతమైన రాజకీయ నేతల్లో నాన్సీ ఒకరు. యూఎస్ హౌస్ స్పీకర్‌గా 2021లో నాలుగోసారి ఎన్నికయ్యారు. యూఎస్ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తర్వాత అధ్యక్ష పదవికి ఆమె రెండో స్థానంలో నిలిచారు. వెంచర్ క్యాపిటల్ సంస్థ వ్యవస్థాపకులలో ఒకరైన పాల్ పెలోసీ ఈ ఏడాది మొదట్లో మద్యం మత్తులో డ్రైవ్ చేస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన గాయపడ్డారు. ఈ కేసులో ఆయన దోషిగా తేలారు. ఆగస్టులో తన నేరాన్ని కూడా అంగీకరించారు. దీంతో ఐద రోజుల జైలు శిక్ష అనుభవించారు.
Updated Date - 2022-10-28T19:48:30+05:30 IST