Morbi bridge collapse: బీజేపీ ఎంపీకి చెందిన 12 మంది కుటుంబ సభ్యుల మృతి
ABN, First Publish Date - 2022-10-31T09:25:42+05:30
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో(Morbi bridge collapse) బీజేపీ ఎంపీ సోదరి కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ(Rajkot BJP MP) మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా (Mohanbhai Kalyanji Kundariya) సోదరికి చెందిన 12 మంది కుటుంబసభ్యులు మోర్బి వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
రాజ్‌కోట్ (గుజరాత్): గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో(Morbi bridge collapse) బీజేపీ ఎంపీ సోదరి కుటుంబానికి చెందిన 12 మంది మృతి చెందారు.రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ(Rajkot BJP MP) మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా (Mohanbhai Kalyanji Kundariya) సోదరికి చెందిన 12 మంది కుటుంబసభ్యులు మోర్బి వంతెన కూలిన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ‘‘వంతెన కూలిన ప్రమాదంలో ఐదుగురు పిల్లలతో సహా నా సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను.’’ అని ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా సోమవారం ఉదయం చెప్పారు.ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయని ఎంపీ చెప్పారు. మచ్చు నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, రెస్క్యూ బోట్లు కూడా సంఘటనా స్థలంలో ఉన్నాయని బీజేపీ ఎంపీ చెప్పారు. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎంపీ పేర్కొన్నారు. 60 మృతదేహాలను వెలికితీశామని గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘవి చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్‌లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి సంఘవి తెలిపారు.
Updated Date - 2022-10-31T09:25:44+05:30 IST