Smoking Judge : అర్ధనగ్నంగా, సిగరెట్ తాగుతూ... మహిళా జడ్జి విచారణ... చివరికి ఏమైందంటే...

ABN, First Publish Date - 2022-11-27T10:24:28+05:30

కొలంబియా (Colombia)లోని ఓ మహిళా జడ్జికి అనుచితంగా ప్రవర్తించడం అలవాటుగా మారింది

Smoking Judge : అర్ధనగ్నంగా, సిగరెట్ తాగుతూ... మహిళా జడ్జి విచారణ... చివరికి ఏమైందంటే...
Vivian Polania
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కొలంబియా (Colombia)లోని ఓ మహిళా జడ్జికి అనుచితంగా ప్రవర్తించడం అలవాటుగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కామ ప్రకోపంతో ఫొటోలు పోస్ట్ చేసి గతంలో చీవాట్లు తిన్నారు. తాజాగా లో దుస్తులు ధరించి, సిగరెట్ కాల్చుతూ వర్చువల్ కోర్టు విచారణలో పాల్గొని సస్పెన్షన్‌కు గురయ్యారు.

మహిళా జడ్జి వివియన్ పొలానియా (34) గతంలో తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కామ ప్రకోపంతో కూడిన ఫొటోలను పోస్ట్ చేశారు. దీనిపై అధికారులు స్పందించి, ఆమెను మందలించారు. ఆమె ఇటీవల జూమ్ కోర్టు హియరింగ్ (ఆన్‌లైన్‌లో విచారణ) నిర్వహించారు. 2021 జూన్‌లో జరిగిన కారు బాంబు పేలుడు కేసు నిందితుని బెయిలు దరఖాస్తుపై ఆమె విచారణ జరిపారు. ఆ సమయంలో ఆమె లోదుస్తులు ధరించి, సిగరెట్ కాల్చుతూ కనిపించారు. దీంతో వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో ఒకరు ఆమెను అప్రమత్తం చేశారు.

నోర్టె డీ సంటాండెర్‌లోని జ్యుడిషియల్ డిసిప్లినరీ కమిషన్ వివియన్ పొలానియా (Vivian Polania) ప్రవర్తనపై విచారణ జరిపింది. జడ్జి పొలానియా వర్చువల్ కోర్టు హియరింగ్‌లో దాదాపు ఓ గంట సేపు కెమెరా ఆఫ్ చేసుకుని ఉన్నారని, ఆ తర్వాత కెమెరాను ఆన్ చేశారని, అప్పుడు ఆమె మంచంపై పడుకుని, సిగరెట్ కాల్చుతూ, లో దుస్తులు ధరించి, అర్ధ నగ్నంగా కనిపించారని నిర్థరించింది. ఆమె శరీర పైభాగంలో ధరించిన వస్త్రాలు చెల్లాచెదురుగా ఉన్నాయని, కళ్లు నిద్ర మత్తులో ఉన్నట్లు కనిపించాయని గుర్తించింది. ఈ పరిస్థితిని ఆమెకు న్యాయవాదులు తెలిపిన వెంటనే ఆమె కెమెరాను ఆఫ్ చేశారని నిర్థరించింది. ఆమె పరిపాలనపరమైన అనేక నిబంధనలను ఉల్లంఘించారని నిర్థరిస్తూ, ఆమెను మూడు నెలలపాటు సస్పెండ్ చేసింది.

ఇదిలావుండగా, పొలానియా ఓ రేడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను అర్ధనగ్నంగా ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను తిరస్కరించారు. విచారణ సమయంలో తనకు లో బీపీ వచ్చిందని, అందుకే తాను మంచంపై పడుకోవలసి వచ్చిందని చెప్పారు.

Updated Date - 2022-11-27T10:24:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising