ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Bharat Jodo Yatra: రాహుల్‌తో అడుగులు వేయనున్న ఆదిత్య థాకరే

ABN, First Publish Date - 2022-11-07T16:07:08+05:30

ముంబై: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్ర లోకి అడుగుపెడుతోంది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు..

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ముంబై: రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపట్టిన 'భారత్ జోడో యాత్ర' (Bharat Jodo Yatra) మహారాష్ట్ర (Maharashtra)లోకి అడుగుపెడుతోంది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే (Aaditya Thackeray) భారత్ జోడో యాత్రలో పాల్గోనున్నారు. థాకరే గ్రూప్ ఎమ్మెల్యే సచిన్ అహిర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆదిత్య ఆసక్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చురుకుగా జరుగుతున్నాయి. భారత్ జోడో యాత్రలో శివసేన పాల్గొంటుందని ఉద్ధవ్ థాకరే సైతం ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే తాను హాజరయ్యే అవకాశాలు మాత్రం తక్కువేనని చెప్పారు.

మహారాష్ట్రలో బీజేపీ, షిండే గ్రూప్, ఎంఎన్ఎస్‌ను ఎదుర్కోవాలంటే మహా వికాస్ అఘాడి (MVA) బలపడాల్సిన అవసరం ఉందని, ఆ కారణంగానే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలనే నిర్ణయం శివసేన తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అనుగుణంగానే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కొద్దిరోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీ సైతం మీడియా సమావేశంలో ఎన్‌సీపీ, శివసేన ప్రముఖ నేతలు ఈ యాత్రలో పాల్గొంటారని ప్రకటించింది. అయితే, బిజీ షెడ్యూల్, ఇతరత్రా కారణాల రీత్యా ఎవరెవరు ఈ యాత్రలో పాల్గొంటారనేది ఇంకా నిర్ణయం కాలేదు. అయితే, నేరుగా ప్రజలను కలిసి వారికి మరింత చేరువయ్యేందుకు అవకాశం ఉండటంతో పలువురు నేతలు ఈ యాత్రలో పాల్గొనేందుకు మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు.

కాగా, భారత్ జోడో యాత్ర రాష్ట్రంలోని ఐదు జిల్లాలోను కలుపుతూ 14 రోజుల పాటు 384 కిలోమీటర్లు సాగనుంది. నాందేడ్, హింగోలి, వాసిం, అకోలా, బుల్దానా జిల్లాల్లో ఈ యాత్ర సాగుతుంది. అకోలా జిల్లాలోని యాత్ర మార్గంలో కారులో రాహుల్ ప్రయాణిస్తారు. పలు సామాజిక సంస్థలు కూడా ఈ యాత్రలో పాలుపంచుకోనున్నాయి.

Updated Date - 2022-11-07T16:15:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!