Shraddha Walkar Case: డాక్టర్‌తో అఫ్తాబ్ డేటింగ్, పోలీసులు ఎలా ట్రేస్ చేశారంటే?
ABN, First Publish Date - 2022-11-26T16:05:18+05:30
శ్రద్ధ వాకర్ దారుణ హత్య కేసులో ఈ కిరాతకానికి పాల్పడిన అఫ్తాబ్ పూనావాలా నిర్వాకం రోజుకొకటి వెలుగుచూస్తూనే ఉంది. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి..
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ (Shraddha Walkar) దారుణ హత్య కేసులో ఈ కిరాతకానికి పాల్పడిన అఫ్తాబ్ పూనావాలా (Aftab Poonawala) నిర్వాకం రోజుకొకటి వెలుగుచూస్తూనే ఉంది. శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టిన వెంటనే ఓ మహిళను తన ఫ్లాట్‌కు పిలిచి ఆమెతో అఫ్తాబ్ డేటింగ్ చేశాడు. ఆ మహిళ ఎవరనేది పోలీసులు కూపీ లాగి ఆమె వృత్తిరీత్యా ఒక డాక్టర్ అని గుర్తించారు. ఆమెను కాంటాక్ట్ చేసిన పోలీసులు వృత్తిరీత్యా ఆమె ఒక సైకియాట్రిస్ట్ అని తెలుసుకున్నారు. మొబైల్ డేటింగ్ అప్లికేషన్ ''బంబ్లే'' (Bumble) ద్వారా ఆ మహిళను అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఇదే బంబ్లే నుంచి రెండేళ్ల క్రితం శ్రద్ధను అఫ్తాబ్ కలుసుకున్నాడు.
ఢిల్లీ పోలీసులు ఈ కేసు విచారణలో భాగంగా డేటింగ్ అప్లికేష్ బంబ్లేకు లేఖ రాశారు. ఇదే వేదిక నుంచి పలువురు మహిళలను అఫ్తాబ్ కలుసుకున్నట్టు వారి విచారణలో వెల్లడైంది. కాగా, ఈ కేసులో అఫ్తాబ్‌కు రోహిణిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో శుక్రవారంనాడు పోలోగ్రాఫ్ పరీక్ష చేశారు. పోలోగ్రాఫ్ పరీక్షకు సంబంధించి అన్ని సెషన్లు పూర్తయ్యాయని, ప్రీ, మెయిన్, పోస్ట్ అనే మూడు స్టేజ్‌లు ఈ పరీక్షలో ఉంటాయని ఎఫ్ఎస్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. నిపుణులు ఈ పరీక్షలను విశ్లేషించి రిపోర్ట్ రూపొందిస్తారని చెప్పారు. నివేదికపై నిపుణులు సంతృప్తి చెందనట్లయితే మరోసారి అఫ్తాబ్‌ను పిలిపిస్తామన్నారు. నివేదిక ఆధారంగా నార్కో అనాలసిస్ పరీక్షపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాగా, అంబేద్కర్ ఆసుపత్రిలో అఫ్తాబ్‌కు సోమవారంనాడు నార్కో టెస్ట్ జరుపనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2022-11-26T16:05:19+05:30 IST