ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajiv assassination case: రాజీవ్ హత్య కేసులో దోషులను విడుదల చేయడంపై సుప్రీంలో కేంద్రం పిటిషన్

ABN, First Publish Date - 2022-11-17T21:09:14+05:30

భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi assassination case) ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) సవాలు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో (Rajiv Gandhi assassination case) ఆరుగురు దోషులను విడుదల చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం (Central Govt) సవాలు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసింది. దోషులకు ఉపశమనం కల్పిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్ట్ సమీక్షించాలని కోరింది. ఈ కేసులో కోర్ట్ జారీ చేసిన ఆదేశాలు లోపభూయిష్టమని, దోషులను విడుదల చేయడంపై వాదనలు వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. తగిన వాదనలు కూడా వినిపించే అవకాశం ఇవ్వకుండా దోషులను విడుదల చేయడమంటే.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినట్టు అంగీకరించడమే అవుతుందని కేంద్రం వ్యాఖ్యానించింది. న్యాయాన్ని నీరుగార్చినట్టేనని పేర్కొంది. దేశం జన స్రవంతి, శాంతి, సామరస్యం, నేర న్యాయ వ్యవస్థపై తీవ్ర పరిణామాలు చూపే ఈ తరహా వ్యవహారాలలో కేంద్ర ప్రభుత్వ సహాయం చాలా ముఖ్యమని పేర్కొంది.

కాగా రాజీవ్ హత్య కేసులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులు- నళిని, మురుగన్, సంథాను, రాబర్డ్ పయాస్, జయకుమార్‌లకు జైలు విముక్తి కల్పిస్తూ గతవారమే సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది. ఇతర ఏ కేసుల్లోనూ అవసరం లేకుంటే దోషులందరినీ విడుదల చేయవచ్చునని పేర్కొంది. దాంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత దోషులంతా జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే.

Updated Date - 2022-11-17T23:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising