Amravati: కుప్పకూలిన భవనం...ఐదుగురి దుర్మరణం
ABN, First Publish Date - 2022-10-31T06:18:08+05:30
మహారాష్ట్రలోని అమరావతి(Amravati) నగరంలో ఓ పాత భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రభాత్ చౌక్ లోని పురాతన భవనం(old building) కుప్పకూలిన(collapses) ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తి సింగ్ చెప్పారు.
అమరావతి(మహారాష్ట్ర): మహారాష్ట్రలోని అమరావతి(Amravati) నగరంలో ఓ పాత భవనం కుప్పకూలిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. ప్రభాత్ చౌక్ లోని పురాతన భవనం(old building) కుప్పకూలిన(collapses) ఘటనలో ఐదుగురు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని అమరావతి పోలీసు కమిషనర్ డాక్టర్ ఆర్తి సింగ్ చెప్పారు. భవనం కూలిన వెంటనే పోలీసులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టారు. భవనంలో నివాసమున్నవారు ఖాళీ చేయగా గ్రౌండు ఫ్లోరులో ఐదు దుకాణాల్లో కొంత మంది పనిచేస్తుండగా ఈ భవనం కుప్పకూలింది.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, ఈ భవనం కూలిన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టరు పవనీత్ కౌర్ చెప్పారు. పురాతన భవనాన్ని కూల్చివేయాలని అమరావతి మున్సిపల్ అధికారులు నోటీసు జారీ చేశారని సమాచారం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన మహారాష్ట్ర(Maharashtra) సీఎం ఏక్ నాథ్ షిండే(Chief Minister Eknath Shinde) వారికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. క్షతగాత్రులకు సత్వరం వైద్య చికిత్స చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఘటనపై డివిజనల్ కమిషనరుతో దర్యాప్తు జరిపించాలని మంత్రి ఫడ్నవీస్ ఆదేశించారు.
Updated Date - 2022-10-31T06:21:53+05:30 IST