ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Priyanka gandhi: డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రియాంక సెటైర్..

ABN, First Publish Date - 2022-11-07T19:27:17+05:30

ఉనా: బీజేపీ తరచు చెప్పుకునే ''డబుల్ ఇంజిన్'' ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఛలోక్తులు విసిరారు. హిమాచల్ ప్రదేశ్‌ లో బీజేపీ డబుల్ ఇంజన్ ...

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఉనా: బీజేపీ తరచు చెప్పుకునే ''డబుల్ ఇంజిన్'' (Double engine) ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఛలోక్తులు విసిరారు. హిమాచల్ ప్రదేశ్‌ (Himachal pradesh)లో బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వమే గత ఐదేళ్లుగా అధికారంలో ఉందని, బహుశా ఇంజిన్‌లో ఇంధనం నింపడం మరిచిపోయి ఉంటారని సెటైర్ వేశారు. నిరుద్యోగం, ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ అంశాలపై అధికార బీజేపీ సర్కార్‌ తీరును ఆమె ఎండగట్టారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే లక్ష మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, తొలి మంత్రివర్గ సమావేశంలోనే పాత పెన్షన్ పథకాన్ని తిరిగి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

''ప్రతి ఐదేళ్లకు ఎన్నికలు వస్తాయి. ఇందులో పెద్ద విషయమేమీ లేదు. కానీ, ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు పాత పెన్షన్ పథకాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు? కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఈ స్కీమ్ అమలవుతోంది. బాగా ఆలోచించండి'' అని ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రియాంక అన్నారు. బీజేపీ నేతలు వచ్చి తమకు ఓటు వేస్తే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వస్తుందని చెబుతుంటారని, మరి గత ఐదేళ్లుగా వారు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ఐదేళ్లయినా డబుల్ ఇంజిన్ పనిచేయలేదని, బహుశా ఇంజిన్‌లో ఇంధనం నింపడం మరిచిపోయి ఉంటారని విమర్శించారు. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ హిమాచల్ ప్రదేశ్‌లో 63,000 ఉద్యోగాలు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నాయని చెప్పారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తొలి క్యాబినెట్ సమావేశంలోనే లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇదేమీ అసాధ్యమైనది కాదని, ఛత్తీస్‌గఢ్‌లో తాము ఆపని చేసి చూపించామని అన్నారు. ఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం చాలా తక్కువగా ఉందని, గత మూడేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు అక్కడ ఇచ్చామని చెప్పారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం 1.3 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని, కానీ హిమాచల్ ప్రదేశ్‌లో 63,000 ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉన్నాయన్నారు. ఇక్కడి యువత ప్రతిభావంతులైన వారే కాకుండా బాగా చదువుకున్న వారని, కానీ వారి ఆకాంక్షలు నెరవేరడం లేదని, మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్లపై..

గతంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి సైన్యంలోకి 4,000 మంది రిక్రూట్ అయ్యే వాళ్లని, ఇప్పుడు 500 మంది మాత్రమే రిక్రూట్ అవుతున్నారని, వారిలో 75 శాతం మంది వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారని ప్రియాంక అన్నారు. అధికారం కోసం ఎన్నికల మందు బీజేపీ నేతలు చాలా చెబుతారని, అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోతారని, డబ్బులతో గెలవలేరని బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే పాత పెన్షన్ స్కీమ్ తిరిగి తెస్తామని, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని, రూ.680 కోట్ల స్టార్టప్ ఫండ్ కేటాయిస్తామని, లక్ష ఉద్యోగాలు, 18 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ప్రతినెలా రూ.1,500 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. కాగా, నవంబర్ 12న హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 8న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

Updated Date - 2022-11-07T19:27:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!