ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hindi: ఐక్యరాజ్యసమితి అధికారభాషగా హిందీ!

ABN, First Publish Date - 2022-10-27T20:51:16+05:30

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి అధికారభాషల్లో హిందీ కూడా చేరనుందా?

United Nations Hindi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి (United Nations) అధికారభాషల్లో హిందీ (Hindi) కూడా చేరనుందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే సమాధానం వస్తోంది. ఇప్పటికే ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్, చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ భాషలు ఐక్యరాజ్యసమితి అధికారభాషలుగా ఉన్నాయి. త్వరలో హిందీని కూడా అధికారభాషగా చేసేందుకు భారత్ యత్నాలు ముమ్మరం చేసింది. ఐక్యరాజ్యసమితి ప్రధానకేంద్రంలో హిందీ వాడుకపై ఇప్పటికే ఎంఓయూ ఉందని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (jai shankar) చెప్పారు. ఐక్యరాజ్యసమితిలోని యునెస్కోకు సంబంధించి ఇప్పటికే హిందీని సోషల్ మీడియాలోనూ, న్యూస్ లెటర్లలోనూ వాడుతున్నామని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితికి సంబంధించి కూడా త్వరలోనే శుభవార్త వినే అవకాశం ఉండొచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల వల్ల జూన్ 21ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. 2014 నుంచి అనేక దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. చిరుధాన్యాలపై కూడా భారత్ ఐక్యరాజ్యసమితి దృష్టిని ఆకర్షించింది. ఆయుర్వేదంపై కూడా ఐక్యరాజ్యసమితితో కలిసి ఉమ్మడి ప్రాజెక్టుల కోసం యత్నిస్తోంది.

అదే తరహాలో కేంద్రం ప్రస్తుతం హిందీపై దృష్టిసారించడంతో ఐక్యరాజ్యసమితి త్వరలోనే హిందీని అధికారిక భాషగా గుర్తించే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2022-10-27T21:05:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising