ఈ గుజరాత్ నేను సృష్టించిందే!: మోదీ
ABN , First Publish Date - 2022-11-07T02:47:12+05:30 IST
ఆ గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను) అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

న్యూఢిల్లీ, నవంబరు 6: ‘ఆ గుజరాత్, మాయ్ బన్వాయూ చే’ (ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను) అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన అనంతరం తొలిసారిగా వల్సాద్ జిల్లా కప్రదాలో ఆదివారం జరిగిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ‘‘ప్రస్తుతం ప్రతి గుజరాతీ ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. ప్రతి మాటా గుజరాత్ హృదయం నుంచి వస్తోంది. ఈ గుజరాత్‌ను నేను తయారు చేశాను’’ అని అన్నారు. రాష్ట్ర పరువు తీయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. ‘‘గత 20 ఏళ్లుగా రాష్ట్రానికి అపఖ్యాతి తీసుకురావడంలోనే సమయాన్ని వెచ్చిస్తున్న విభజన శక్తులను గుజరాత్ ఊడ్చి పారేస్తుంది’’ అని వ్యాఖ్యానించారు.
Read more