Cyrus Mistry: సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం కేసు.. గైనకాలజిస్ట్‌పై కేసు నమోదు
ABN, First Publish Date - 2022-11-05T18:12:28+05:30
టాటాసన్స్ (Tata Sons) మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ముంబై: టాటాసన్స్ (Tata Sons) మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదానికి సంబంధించిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. పోలీసులు తాజాగా ముంబై గైనకాలజిస్ట్ డాక్టర్ అనహిత పండోలే(55)పై కేసు నమోదు చేశారు. సెప్టెంబరులో మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ ప్రమాదం జరిగింది. మిస్త్రీ ప్రయాణిస్తున్న కారు అహ్మదాబాద్ నుంచి బయల్దేరి ముంబైకి వెళ్తుండగా వీరి కారు రాంగ్ సైడ్‌లో మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురైనట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో మిస్త్రీతోపాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాద సమయంలో కారు 120 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తోంది.
ప్రమాదంలో ముందు సీట్లో కూర్చున్న అనహిత పండోలే ( Anahita Pandole), ఆమె భర్త డారియస్ పండోలే (60) ఇద్దరూ గాయాలతో బయటపడ్డారు. వెనక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ, డారియస్ పండోలే సోదరుడు జహంగీర్ పండోలే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో పోలీసులు తాజాగా కారు డ్రైవ్ చేసిన అనహిత పండోలేపై కేసు నమోదు చేశారు.
Updated Date - 2022-11-05T18:12:29+05:30 IST