ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shraddha delhi news: శ్రద్ధా హత్యోదంతం నిందితుడు అఫ్తాబ్‌‌ ఏం చెప్పుకునేవాడంటే..

ABN, First Publish Date - 2022-11-16T17:49:34+05:30

ప్రియురాలి ప్రాణాలు తీసి.. శరీరాన్ని 35 ముక్కలుగా ఖండించిన ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha delhi news) నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు (Aftab Ameen Poonawalla) సంబంధించి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రియురాలి ప్రాణాలు తీసి.. శరీరాన్ని 35 ముక్కలుగా ఖండించిన ‘శ్రద్ధా హత్య కేసు’లో (Shraddha delhi news) నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు (Aftab Ameen Poonawalla) సంబంధించి సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నించారు. సోషల్ మీడియాలో అఫ్తాబ్‌ తనని తాను ఏవిధంగా చిత్రీకరించుకున్నాడో అతడికి సంబంధించిన పలు అకౌంట్లను పరిశీలించిన తర్వాత వెల్లడైంది. ‘హంగ్రీచొక్రో-ఎస్కెపేడ్స్’ పేరిట ఒక ఫుడ్ బ్లాగ్ అకౌంట్‌ను అతడు నిర్వహించాడు. దీనికి 28,500 మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇందులో అనేక ఇండియన్, చైనీస్ వంటకాలకు సంబంధించిన హైరిజుల్యూషన్ ఫొటోలను పోస్ట్ చేశాడు. ఈ పోస్టుల్లో అత్యధికం పాపులర్ రెస్టారెంట్లకు సంబంధించినవే ఉన్నాయి. ఈ అకౌంట్ బయోలో ఒక ఫొటోగ్రాఫర్‌గా, ఫుడ్ అండ్ బేవరేజెస్ కన్సల్టెంట్‌గా, ఫుడ్ ఫొటోగ్రాఫర్‌గా అఫ్తాబ్ అభివర్ణించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 2 నుంచి ఈ అకౌంట్ ఇన్‌యాక్టివ్‌గా ఉంది. ఫిబ్రవరి 2న క్రాన్‌బెర్రీ చాకోలెట్ స్క్వేర్స్ ఫొటోను చివరి పోస్ట్‌గా పెట్టాడు. తన బ్లాగ్స్‌కు సంబంధించిన ఫేస్‌బుక్, ట్విటర్ అకౌంట్ల లింకులను కూడా అందుబాటులో ఉంచాడు. వంట విధానాలు, ఆదరణ కలిగిన వంటకాల్లో వాడే పదార్థాల వివరాలను వాటిల్లో పేర్కొన్నాడు.

ఇక ఫేస్‌బుక్‌లో జనవరి 2019లో అఫ్తాబ్ చివరి పోస్ట్ పెట్టాడు. ఇందులో మార్చిన ప్రొఫైల్ ఫొటోలతోపాటు అతడు ట్యాగ్ చేసిన వేర్వేరు రెస్టారెంట్లు ఉన్నాయి. వసాయ్‌(Vasai)లోని సెయింట్ ఫ్రాన్సిస్ హై స్కూల్‌లో చదువుకున్నట్టు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లోని వివరాలు పేర్కొన్నాయి. ఎల్ఎస్ రాహేజా కాలేజీలో బీఎంఎస్ డిగ్రీ చదివాడు. ఫేస్‌బుక్‌లో పలు పోస్టుల ద్వారా ఎల్‌జీబీటీక్యూఐఏ+ మద్దతుదారుడిగా, పర్యావరణప్రేమికుడిగా, స్వేచ్ఛావాదిగా అఫ్తాబ్ తనను తాను చిత్రీకరించుకున్నాడు. ముంబైలోని ఆరే ఫారెస్ట్‌ను రక్షించాలంటూ నాటి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేని అభ్యర్థించిన ఆన్‌లైన్ పిటిషన్‌ను ఉద్ధవ్ థాక్రే షేర్ చేశాడు. ఎల్‌జీబీటీక్యూ+ కమ్యూనిటీకి మద్ధతుగా జూన్ 2015లో ఒక పోస్టును షేర్ చేశాడు. దీపావళి నాడు టపాసులు కాల్చితే పర్యావరణం దెబ్బతింటుందని తెలియజేసే మరో పోస్టును కూడా పెట్టాడు.

Updated Date - 2022-11-16T17:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising