ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid-19 : కోవిడ్ నిరోధానికి ఐఎంఏ మార్గదర్శకాలు

ABN, First Publish Date - 2022-12-22T18:41:16+05:30

కోవిడ్-19 (Covid-19) మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందనే ఆందోళన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్

Covid Guidelines
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్-19 (Covid-19) మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందనే ఆందోళన నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ప్రజలకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తక్షణమే వీటిని పాటించాలని ప్రజలను కోరింది. ప్రజలు గుంపులుగా చేరవద్దని, వివాహ వేడుకలు, రాజకీయ సమావేశాలు, విదేశీయానాల సమయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. 2021లో కోవిడ్ విజృంభణ వల్ల ఏర్పడిన పరిస్థితులు పునరావృతమైతే ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.

ప్రస్తుతానికి భయపడవలసిన పరిస్థితి లేదని స్పష్టం చేసింది. రోగం వచ్చిన తర్వాత నయం చేయడం కన్నా, దానిని ముందుగానే నిరోధించడం శ్రేయస్కరమని తెలిపింది.

IMA మార్గదర్శకాలు :

- బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.

- భౌతిక దూరం పాటించాలి, సబ్బు, నీళ్లు, లేదా శానిటైజర్‌తో చేతులను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.

- వివాహ వేడుకలు, రాజకీయ లేదా సాంఘిక సమావేశాలు వంటివాటిలో పాల్గొనడాన్ని తప్పించుకోవాలి.

- విదేశీ ప్రయాణాలను మానుకోవాలి.

- తరచూ విరోచనాలు అవుతుండటం, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

- సత్వరమే కోవిడ్ టీకాలను తీసుకోవాలి. ముందు జాగ్రత్తగా తీసుకోవలసిన మోతాదు (డోస్)ను కూడా తీసుకోవాలి.

- ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలను పాటించాలి.

Updated Date - 2022-12-22T18:41:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising