ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jama Masjid: జమా మసీదు కమిటీ కీలక నిర్ణయం.. ముస్లిం మహిళలు ఎలా స్పందిస్తారో..

ABN, First Publish Date - 2022-11-24T16:24:32+05:30

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మజీద్ (Jama Masjid) కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత జమా మజీద్ (Jama Masjid) కీలక నిర్ణయం తీసుకుంది. మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది. ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్లు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు జమా మసీద్ మాస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ (Jama Masjid Mosque Management Committee) నిర్ణయం తీసుకుంది. మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు వారి కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని తెలిపింది. ఈ మేరకు కొద్దిరోజుల క్రితమే మసీద్ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీస్ అంటించారు.

ఈ పరిణామంపై ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (Delhi Commission for Women) స్పందించింది. ఈ అంశంపై జమా మసీద్ పాలనా యంత్రాంగానికి నోటీసు జారీ చేయనున్నామని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు. ఈ తరహా నిషేధం విధించేందుకు ఎవరికీ హక్కులులేవని తప్పుబట్టారు.

మరోవైపు జమా మసీద్ కమిటీ నిర్ణయాన్ని మసీద్ పీఆర్‌వో(Public Relations Office) సబివుల్లా ఖాన్ సమర్థించారు. ప్రార్థనల కోసం వచ్చినవారికి ఇబ్బందికలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కుటుంబాలు లేదా దంపతులపై ఎలాంటి నిషేధంలేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-24T16:24:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising