Satish Jarkiholi: కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం..
ABN, First Publish Date - 2022-11-07T17:42:15+05:30
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు: కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చిందని, పర్షియా భాషలో హిందూ పదానికి అత్యంత మురికి అనే అర్థం వస్తుందన్నారు. నిజానికి హిందూ అనే పదానికి భారతదేశానికి సంబంధమే లేదని సతీశ్ చెప్పారు. హిందూ అని ఎలా ప్రకటించుకుంటారని ఆయన ప్రశ్నించడం దుమారం రేపింది.
ఓ పక్క కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహిస్తుండగానే సతీశ్ జార్కిహోలి హిందువులను కించపరుస్తూ వ్యాఖ్యానించడం ఎంతవరకూ సబబని భారతీయ జనతా పార్టీ నాయకురాలు ఖుష్బూ ప్రశ్నించారు. తొలుత శివరాజ్‌పాటిల్, నేడు సతీశ్ జార్కిహోలి హిందువులను అవమానిస్తున్నారంటూ ఖుష్బూ విరుచుకుపడ్డారు. హిందూ ధర్మాన్ని అవమానించడం ఎంత వరకూ సబబని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శివరాజ్‌పాటిల్ ఇటీవలే భగవద్గీతలో కూడా జిహాద్ ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా సతీశ్ జార్కిహోలి హిందు అంటే అత్యంత మురికి అని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.
సతీశ్ జార్కిహోలి వ్యాఖ్యలపై హైందవ సంస్థలు, వాటి ప్రతినిధులు విరుచుకుపడుతున్నారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ సతీశ్ జార్కిహోలి హిందువులపై చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి మరింత చేటు తెస్తాయని రాజకీయ పరిశీలకులంటున్నారు.
Updated Date - 2022-11-07T17:42:15+05:30 IST