Shraddha case: శ్రద్ధాను చంపేసిన అఫ్తాబ్‌కు ఓ యువకుడి మద్ధతు.. ఏమన్నాడంటే..
ABN, First Publish Date - 2022-11-25T16:38:28+05:30
దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన ‘శ్రద్ధా వాకర్ హత్యోదంతం’ (delhi Shraddha Walkar murder case) యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సహజీవన భాగస్వామి శ్రద్ధాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలా (Aaftab Amin Poolawala) కిరాతకంగా హత్య చేయడం..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన ‘శ్రద్ధా వాకర్ హత్యోదంతం’ (delhi Shraddha Walkar murder case) యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సహజీవన భాగస్వామి శ్రద్ధాను ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమిన్ పూనావాలా (Aaftab Amin Poolawala) కిరాతకంగా హత్య చేయడం.. మృతదేహాన్ని 35 ముక్కలుగా ఖండించి పడేసిన తీరు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంతటి దారుణచర్యను మనిషన్నవారెవరూ సమర్థించరు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లా సికంద్రాబాద్‌కు చెందిన వికాస్ కుమార్ అనే యువకుడు అఫ్తాబ్ అమీన్‌ను సమర్థించాడు. ఆవేశంలో ఉన్నప్పుడు ఇలా చర్యలకు పాల్పడుతుంటారని, కోపంలో ఉన్నప్పుడు 35 ముక్కలే కాదు.. 36 ముక్కలు కూడా కావొచ్చని నిస్సిగ్గుగా వ్యాఖ్యానించాడు. అఫ్తాబ్ చేసిన సరైదేనని సమర్థించాడు. ‘నువ్వైనా ఇలాగే చేస్తావా?’ అని ప్రశ్నించగా.. ఇలాంటి పనులు ఆవేశంలో జరుగుతుంటాయని, ఇదేమీ పెద్ద విషయం కాదని అతడు బదులిచ్చాడు. ఈ మేరకు ఢిల్లీలో ఓ రిపోర్టర్‌తో మాట్లాడాడు. అయితే తానొక ముస్లింనని, తన పేరు రషీద్ ఖాన్ అని చెప్పుకోవడం గమనార్హం.
కాగా నిందిత యువకుడు వికాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడికి నేరచరిత్ర ఉందని బులంద్‌షెహర్ ఎస్‌పీ శ్లోక్ కుమార్ వెల్లడించారు. దొంగతనాలు, అక్రమాయుధాలు కలిగివుండడంతో బులంద్‌షెహర్, నోయిడా నగరాల్లో ఇతడిపై కేసులున్నాయని వివరించారు. తన వ్యాఖ్యలు ఇంతటి పరిణామానికి దారితీస్తాయని తెలియదని నిందిత యువకుడు అరెస్ట్ అనంతరం చెప్పారు. ‘‘ నన్ను చంపేస్తారేమోనని భయంగా ఉంది. ఇక్కడో లేదా జైళ్లోనో చంపేస్తారు’’ అని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నావా అని ప్రశ్నించగా ఈ మేరకు బదులిచ్చాడు. కాగా దాదాపు ఆరు నెలలక్రితం ఢిల్లీలో శ్రద్ధా వాకర్ హత్య జరిగింది. ప్రియురాలు శ్రద్ధాను గొంతునులిమి చంపేసిన అఫ్తాబ్.. ఆ తర్వాత మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికాడు. ఆ ముక్కలను ఫ్రిజ్‌లో పెట్టి 18 రోజుల వ్యవధిలో అన్నింటినీ అటవిలో పడేసిన విషయం తెలిసిందే.
Updated Date - 2022-11-25T17:11:18+05:30 IST