Morbi Bridge Collapse: గుజరాత్ సర్కార్‌ను నివేదిక కోరిన హైకోర్టు
ABN, First Publish Date - 2022-11-07T14:32:02+05:30
అహ్మదాబాద్: మోర్బీ బ్రిడ్జి కుప్పకూలి 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై సుమోటో విచారణను గుజరాత్ హైకోర్టు సోమవారంనాడు..
అహ్మదాబాద్: మోర్బీ బ్రిడ్జి (Morbi bridge) కుప్పకూలి 130 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై సుమోటో విచారణను (Suo motu Cognizance) గుజరాత్ హైకోర్టు (Gujarat high court) సోమవారంనాడు చేపట్టింది. ఈ ఘటనపై వారం రోజుల్లోగా కోర్టుకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హోం శాఖ, అర్బన్ శాఖ, మోర్బీ మున్సిపాలిటీ, రాష్ట్ర మానవ హక్కుల సంఘంతో సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నోటీసులిచ్చింది.
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనకు సంబంధించి మోర్బీ మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జాలాను గుజరాత్ ప్రభుత్వం ఇటీవల సస్పెండ్ చేసింది. గత ఆదివారంనాడు జరిగిన బ్రిడ్జి దుర్ఘటనలో మరణించిన వారిలో పులువురు మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకూ తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర సంచలనమైంది.
Updated Date - 2022-11-07T14:32:02+05:30 IST