ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid Vaccine : తల్లిదండ్రుల టీకా చాదస్తం... ప్రాణాపాయ స్థితిలో పసికందు... కోర్టు కస్టడీలో బిడ్డ...

ABN, First Publish Date - 2022-12-07T16:57:36+05:30

ఆరు నెలల పసికందు ‘బేబీ డబ్ల్యూ’ (Baby W) పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ అనే గుండె సంబంధిత వ్యాధితో

Covid Vaccine
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్లింగ్టన్ : ఆరు నెలల పసికందు ‘బేబీ డబ్ల్యూ’ (Baby W) పల్మనరీ వాల్వ్ స్టెనోసిస్ అనే గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆ పసిగుడ్డుకు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు చెప్పారు. అయితే ఆ బిడ్డ తల్లిదండ్రులకు కోవిడ్ టీకాలంటే చాలా వ్యతిరేకత ఉంది. ఈ టీకా తీసుకున్నవారి రక్తాన్ని తమ బిడ్డకు ఇస్తారనే అనుమానంతో మొత్తంగా శస్త్ర చికిత్సనే అడ్డుకున్నారు. దీంతో ఆక్లాండ్ హైకోర్టు (Auckland High Court) డిసెంబరు 7న తీర్పు చెప్తూ, ఆ బిడ్డను తాత్కాలికంగా కస్టడీలోకి తీసుకుంది. శస్త్ర చికిత్స పూర్తి చేసిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించాలని నిర్ణయించింది.

ఆ పసికందుకు శస్త్ర చికిత్స చేయాలని వైద్యులను ఆదేశించింది. మిగిలిన అన్ని అంశాల్లోనూ ఆ బిడ్డ తల్లిదండ్రులే సంరక్షకులుగా కొనసాగుతారని తెలిపింది. ఆ బిడ్డ జనవరి నెలాఖరునాటికి కోలుకుంటుందని, అప్పటి వరకు కోర్టు పర్యవేక్షణలో, వైద్య సంరక్షణలో ఉంటాడని తెలిపింది. సముచితమైన అన్ని సందర్భాల్లోనూ బేబీ డబ్ల్యూ పరిస్థితి గురించి, చికిత్స, కోలుకోవడం గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలని వైద్యులను ఆదేశించింది.

టీకాకరణ పట్ల ప్రజలకు తప్పుడు సమాచారం ఉండటం వల్లే ఆ తల్లిదండ్రులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ యాంటీ వ్యాక్సిన్ కాంపెయినర్ లిజ్ గున్ కొందరు మద్దతుదారులతో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి జసింద ఆర్డెర్న్ (Jacinda Ardern)పై ఏదో విధంగా ఒత్తిడి తీసుకొచ్చి, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించే విధంగా చేయాలన్నారు. ‘‘జసింద, ఇప్పుడు నిర్ణయం మీ ముంగిట ఉంది’’ అని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.

టీకాలు తీసుకొననివారి రక్తం కావాలని ఆ బిడ్డ తల్లిదండ్రులు కోరడంపై ఆరోగ్య శాఖాధికారులు స్పందిస్తూ, వ్యాక్సిన్ తీసుకున్నవారి రక్తం, వ్యాక్సిన్ తీసుకొనని వారి రక్తం అంటూ వేర్వేరుగా తాము చూడబోమని స్పష్టం చేశారు.

Updated Date - 2022-12-07T16:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising