ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arunachal clash: భారత్-చైనా సైనికుల ఘర్షణ... రాజ్‌నాథ్ సింగ్ సంచలన నిర్ణయం...

ABN, First Publish Date - 2022-12-13T11:11:08+05:30

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ వద్ద చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లోని తవంగ్ వద్ద చైనా సైనికులు ఘర్షణకు దిగిన నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అత్యవసరంగా అత్యున్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, అడ్మిరల్ ఆర్ హరి కుమార్, జనరల్ మనోజ్ పాండే, ఫారిన్ సెక్రటరీ వినయ్ మోహన్ క్వాట్రా, డిఫెన్స్ సెక్రటరీ గిరిధర్ అరమనే ఈ సమావేశంలో పాల్గొంటారు.

వాస్తవాధీన రేఖ వెంబడి తవంగ్ ప్రాంతంలో చైనా సైనికులు స్పైక్‌డ్ క్లబ్స్, పెద్ద కర్రలతో భారత సైనికులపై డిసెంబరు 9న దాడి చేశారు. ఇరు దేశాల సైనికులు స్వల్పంగా గాయపడ్డారని భారత సైన్యం ప్రకటించింది. ఈ దాడిలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారని, వారిని గువాహటిలోని బసిష్టలో ఉన్న 151 బేస్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపింది. చైనా సైనికులు ఎక్కువ మంది గాయపడినట్లు తెలుస్తోంది.

దాదాపు 30 నెలల నుంచి తూర్పు లడఖ్‌లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల నుంచి ఇరు దేశాలు తమ దళాలను ఉపసంహరించుకున్నప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో దళాల ఉపసంహరణపై చర్చలు జరుగుతున్నాయి.

Updated Date - 2022-12-13T11:11:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising