ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సమ్మతి వయసును పునఃపరిశీలించండి

ABN, First Publish Date - 2022-11-07T02:20:56+05:30

లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో) చట్టంలో సమ్మతి వయసును పునఃపరిశీలించాలని భారత న్యాయ కమిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పోక్సో చట్టంపై లా కమిషన్‌ను కోరిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు, నవంబరు 6: లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ(పోక్సో) చట్టంలో సమ్మతి వయసును పునఃపరిశీలించాలని భారత న్యాయ కమిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 16ఏళ్లు పైబడిన మైనర్‌ బాలికలు ప్రేమలో పడి ఇంటినుంచి పారిపోవడం, లైంగిక సంబంధాలు పెట్టుకోవడం వంటి అనేక కేసులు ఇటీవల నమోదయ్యాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటి ఘటనల్లో లా కమిషన్‌ వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, వయసుకు సంబంధించిన నిబంధనలపై పునరాలోచించాల్సి ఉందని తాము భావిస్తున్నట్లు పేర్కొంది. పోక్సో కేసు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ పోలీసులు దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్‌ సూరజ్‌ గోవిందరాజ్‌, జస్టిస్‌ జి. బసవరాజ్‌తో కూడిన ధర్మాసనం శనివారం విచారించింది. 2017లో ఓ 17 ఏళ్ల బాలిక ఒక బాలుడితో కలసి పారిపోయినట్లు గుర్తించారు.

దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు కొనసాగుతుండగానే ఈ జంటకు వివాహమైంది. ఇప్పుడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ బాలుడిని నిర్దోషిగా విడుదల చేసేందుకు న్యాయస్థానం అంగీకరించింది. ఈ వ్యవహారంలో లా కమిషన్‌కు, కర్ణాటక విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. కనీసం 9వ తరగతి నుంచి విద్యార్థులకు పోక్సో చట్టంతో పాటు ఐసీపీ కింద నేరంగా పరిగణించే చర్యలపై అవగాహన కల్పించాలని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనికి సంబంధించి పాఠ్యప్రణాళిక తయారు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని విద్యాశాఖను ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబరు 5వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2022-11-07T02:20:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!