ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య: కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ఏఎస్పీ, ముగ్గురు వైద్యులు!

ABN, First Publish Date - 2022-11-08T21:21:01+05:30

ఇంట్లో పనికి కుదిరిన 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్యకేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన ఓ ఏఎస్పీ, ముగ్గురు వైద్యులను అసోం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి: ఇంట్లో పనికి కుదిరిన 13 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్యకేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన ఓ ఏఎస్పీ, ముగ్గురు వైద్యులను అసోం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దరంగ్ జిల్లాలో సశస్త్ర సీమా బల్ (SSB) జవాను కృష్ణ కమల్ బారువా ఇంట్లో జూన్ 11న 13 ఏళ్ల బాలిక ఉరేసుకున్న స్థితిలో వేలాడుతూ కనిపించింది. ఆ ఇంట్లో ఆమె పనిమనిషిగా చేరింది. టీ-ట్రైబ్ కమ్యూనిటీకి చెందిన బాధిత బాలికపై జవాను అత్యాచారానికి పాల్పడి ఆపై హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. అయితే, ఈ కేసును ఓ పోలీసు అధికారి, ముగ్గురు వైద్యులు కలిసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. నిందితుడి ఇంట్లో నుంచి బాలిక డబ్బు దొంగిలించి దొరికిపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారు.

కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన ఏఎస్పీ (ASP) రూపమ్ ఫుకన్, దరంగ్ జిల్లాలోని మంగళ్‌దోయి సివిల్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు వైద్యులు అజంత బోర్డోలోయి, అనుపమ్ శర్మ, అరుణ్ దేకాలను సోమవారం (7వ తేదీ) పొద్దుపోయాక అరెస్ట్ చేశారు. గతంలో ఇదే కేసులో ఎస్ఐ ఉత్పల్ బోరా, ఎస్ఎస్‌బీ జవాను బారువాలను అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ బాధిత కుటుంబాన్ని పరామర్శించి న్యాయం చేస్తానని, దోషులను శిక్షస్తామని హామీ ఇచ్చారు.

ఆ తర్వాత దరంగ్ ఎస్పీ రాజ్‌మోహన్ రాయ్, అదనపు ఎస్పీ రూపమ్ ఫుకన్, ధులా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఉత్పల్ బోరాలను సస్పెండ్ చేసి కేసును సీఐడీకి అప్పగించారు. అనంతరం బాలిక మృతదేహానికి పలుమార్లు నిర్వహించిన పోస్టుమార్టంలో బాలికది ఆత్మహత్య కాదని, అత్యాచారం చేసి హత్య చేసినట్టు నిర్ధారణ అయింది. అంతకుముందు ముగ్గురు వైద్యులు నిర్వహించిన పోస్టుమార్టంలో బాలిక ఉరివేసుకోవడం వల్లే చనిపోయిందని నివేదిక ఇచ్చారు. అంతేకాదు, పోస్టుమార్టం సంద్భంగా వీడియో కూడా తీయలేదని సీఐడీ పేర్కొంది. దీనినిబట్టి చూస్తే వైద్యులు ఉద్దేశపూర్వకంగానే కుట్రకు పాల్పడ్డారని, సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, నిందితులను రక్షించే ప్రయత్నం చేశారని తేల్చింది.

ఈ నేపథ్యంలో నిందితులైన ముగ్గురు వైద్యులతోపాటు ఏఎస్పీని కూడా తాజాగా అరెస్ట్ చేశారు. అంతేకాదు, కేసును కప్పిపుచ్చేందుకు నిందితుడి కుటుంబ సభ్యుల నుంచి రూ. 1.5 లక్షలను ఏఎస్పీ రూపమ్ ఫుకన్ తీసుకున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్ఐ ఉత్పల్ బోరా బ్యాంకు ఖాతాకు నిందితుడు కృష్ణ కమల్ బారావా ఖాతా నుంచి రూ. 5 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్టు కూడా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2022-11-08T21:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising