Shraddha aftab: శ్రద్ధా హత్యోదంతంలో వెలుగులోకి మరికొన్ని సంచలన విషయాలు..
ABN, First Publish Date - 2022-11-14T19:11:35+05:30
దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన దారుణ ‘శ్రద్ధా హత్యోదంతం’లో (shraddha ) మరికొన్ని విస్తుగొల్పే విషయాలు వెలుగుచూశాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన దారుణ ‘శ్రద్ధా హత్యోదంతం’లో (shraddha ) మరికొన్ని విస్తుగొల్పే విషయాలు వెలుగుచూశాయి. తనతో సహజీవనం చేసిన శ్రద్ధాను అంతమొందించిన (Mehrauli Murder Case) అనంతరం నిందితుడు అఫ్తాబ్ అమిన్ (aftab amin) ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. భయం బెరుకూ లేకుండా దానిని ఆరగించాడు. ఇక అమెరికన్ క్రైమ్ డ్రామా ‘డెక్స్‌టర్’ (Dexter) ప్రేరణగా ఈ తరహా నేరానికి పాల్పడ్డాడని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. శ్రద్ధా శరీర భాగాలను ముక్కలుముక్కలుగా ఖండించిన అఫ్తాబ్ వాటిని దాచేందుకు ఫ్రిడ్జ్‌ను కొనుగోలు చేశాడని, బయటకు దుర్వాసన రాకుండా అగర్‌బత్తీలు వెలిగించాడని వెల్లడించారు.
కాగా ఢిల్లీలో సహజీవనం చేసిన శ్రద్ధా అనే యువతిని ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమిన్ హత్య చేసిన విషయం తెలిసిందే. మృతురాలి శరీరాన్ని 35 ముక్కలుగా ఖండించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసిన విషయం తెలిసిందే. కాగా హత్య జరిగిన 6 నెలల తర్వాత ఈ విషయం బయటపడింది. ఈ ముంబైలోని ఓ కాల్‌సెంటర్‌లో పనిచేస్తున్న శ్రద్ధా (shraddha), అఫ్తాబ్ అమీన్ (aftab amin) ముంబైలో కొంతకాల సహజీవనం చేశారు. శ్రద్ధా తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఇద్దరూ ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లిపోయారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి వారంలో ఢిల్లీలోని మెహ్రౌలి ప్రాంతంలో ఫ్లాట్‌లో నివాసం ప్రారంభించారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా అడుగుతుండటం అఫ్తాబ్‌కు నచ్చలేదు. ఇదే విషయమై ఇరువురి మధ్య మే 18న వాగ్వాదం జరిగింది. అదే రోజు శ్రద్ధాను అఫ్తాబ్ హత్య చేశాడు. తర్వాత బాడీని 35 ముక్కలుగా నరికాడు. ఈ ముక్కలను దాచేందుకు 300 లీటర్ల ఫ్రిడ్జ్ కొని అందులో దాచాడు. ఆ తర్వాత ప్రతిరోజూ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ప్లాస్టిక్ కవర్‌లో శరీరభాగాలను చుట్టి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసరడం ప్రారంభించాడు. అలా 18 రోజుల పాటు వేర్వేరు ప్రదేశాల్లో శ్రద్ధా శరీర భాగాలను విసిరేసి మృతదేహం జాడలేకుండా చేశాడు.
కూతురి ఫోన్ నంబర్ రెండు నెలలపాటు స్విచాఫ్ రావడంతో అనుమానం వచ్చి శ్రద్ధా తండ్రి స్వయంగా ఢిల్లీ వెళ్లారు. స్నేహితుల సాయంతో ఫ్లాట్‌కు చేరుకుని చూడగా తాళం ఉంది. మరింత అనుమానం రావడంతో ఈ నెల 8న మెహ్రౌలీ పోలీసులను ఆశ్రయించారు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ నెల 11న అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాను ఎలా శ్రద్ధాను చంపి ముక్కలుగా కోసి విసిరేశాడో వివరంగా చెప్పాడు.
Updated Date - 2022-11-14T19:20:42+05:30 IST