EPFO: పింఛనుదారులకు ఎలర్ట్..
ABN, First Publish Date - 2022-11-19T19:49:23+05:30
ప్రైవేటు పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ తాజాగా లైఫ్ సర్టిఫికేట్లకు సంబంధించి కీలక సూచనలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పింఛనుదారులు(Pensioners) నవంబర్ 30లోపు లైఫ్ సర్టిఫికేట్(జీవన్ ప్రమాణ-Jeevan Praman) సమర్పించాలన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రైవేటు పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ(ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్- EPFO) తాజాగా కీలక సూచనలు చేసింది. ఈపీఎఫ్ఓ మార్గదర్శకాల ప్రకారం.. ఈపీఎస్'95 పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ల వ్యాలిడిటీ 12నెలలు. కాబట్టి.. పెన్షన్ జారీ మొదలై ఏడాది పూర్తికాని వారు నవంబర్‌లో లైఫ్ సర్టిఫికేట్(Life Certificate) సమర్పించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా.. 2021 డిసెంబర్ లేదా.. ఆ తరువాత లైఫ్ సర్టిఫికేట్‌లు ఇచ్చిన వారు ఈ నవంబర్‌లో మళ్లీ వాటిని సమర్పించనక్కర లేదు.
ఈపీఎస్'95 పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికేట్ కాలపరిమితి పూర్తయ్యేలోపు ఎప్పుడైనా మళ్లీ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్లను కేవలం ఈపీఎఫ్ఓ కార్యాలయాల్లోనే కాకుండా.. సంబంధిత బ్యాంకు, కామన్ సర్వీస్ సెంటర్లు, పోస్ట్ ఆఫీసు, ఉమంగ్ యాప్ ద్వారా డిజిటల్ రూపంలో కూడా సమర్పించవచ్చు. లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చే సమయంలో పీపీఓ(PPO) నెంబర్, ఆధార్ కార్డ్, బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న ఫోన్ నెంబర్‌ను జత చేయాల్సి ఉంటుంది.
Updated Date - 2022-11-19T19:53:49+05:30 IST